ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం కరోనా వల్ల అతలాకుతలం అవుతుంది. ఇందులో భాగంగానే కరోనాను నియంత్రించేందుకు చాలా దేశాలు వ్యాక్సిన్‌లను తయారు చేశాయి. ప్రస్తుతం భారతదేశంలో కొవిషీల్డ్, కొవాక్సిన్ వ్యాక్సిన్లు జనవరి నుంచి అందుబాటులోకి వచ్చాయి. అలాగే రష్యా నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను కూడా భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది.
కరోనా నియంత్రణలో భాగంగానే మన దేశానికి చెందిన జైడస్ క్యాడిలా అనే సంస్థ జైకోవ్ డి అనే స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇందులో గర్వించదగ్గ విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే మొదటి సారిగా డిఎన్ఏ ఫార్ములాతో తయారు చేసిన వ్యాక్సిన్‌గా జైకోవ్ డి నిలిచింది. ప్రపంచం మొత్తంగా ఈ ఫార్ములాతో కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించారు.
జైడస్ కాడిలా సంస్థ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరానికి చెందినది. జైకోవ్ డి వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించడానికి ఈ నెల ఆరంభంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు జైడస్ క్యాడిలా సంస్థ దరఖాస్తు చేసింది. ఇందులో భాగంగా డిఎన్ఏతో తయారైన ఈ వ్యాక్సిన్ యొక్క మూడవ దశ ట్రయల్స్ చేయగా, టీకాలు వేసుకున్న వాలంటీర్లలో ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని, ఎలాంటి మరణాలు కూడా సంభవించలేదని జైడస్ క్యాడిలా సంస్థ డిజిసిఐకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన దేశవ్యాప్తంగా 50 ప్రదేశాల్లో మూడవ దశ ట్రయల్స్ జరగ్గా, దాదాపు 28 వేల మంది వాలంటీర్లు ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నారు.
కరోనా రెండవ దశ చాలా ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఈ ట్రయల్స్ జరగ్గా, అప్పుడే కొత్త వైరస్ మ్యుటేషన్లపైన కూడా పరిశోధనలు చేశామని, కొత్త స్ట్రెయిన్స్ పైన కూడా జైకోవ్ డి వ్యాక్సిన్ చాలా సమర్థవంతగా పని చేస్తుందని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా చాలా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ పైన కూడా ఇది ఖచ్చితంగా పని చేస్తుందని తెలిపింది. మరో వైపు కరోనా మూడవ దశ ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రభావం చూపిస్తుందని తెలుస్తున్న తరుణంలో, జైడస్ క్యాడిలా తయారు చేసిన జైకోవ్ డి వ్యాక్సిన్‌ను 12 నుంచి 18 సంవత్సరాలు గల పిల్లలపై ప్రయోగించారు. అయితే వారిపై కూడి వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని తెలపడం సంతోషకరమైన విషయం.