ఇదేం పోసుగోలు కబురు కాదు. వాస్తవం. అనంతపురం జిల్లాకు చెందిన ఒక కీలక నాయకుడు.. మాజీ ఎంపీ.. ఒకరు గవర్నర్ గిరీపై కన్నేశారట. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ నేత.. తరచుగా.. ఏపీ రాజకీయాలపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అదేసమయంలో బీజేపీతోనూ టచ్‌లోకి వెళ్తున్నట్టు ఉప్పందిస్తారు. అయితే.. ఆయన వ్యూహం ఏంటో మాత్రం బయటకు చెప్పరు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఈయన బాగానే చక్రం తిప్పారు. పదవులు సంపాయించుకున్నారు.
రాష్ట్ర విభజన వరకు.. ఆ పార్టీలో ఉన్న ఈయన తర్వాత సకుటుంబ సపరివార సమేతంగా.. టీడీపీలలోకి వచ్చారు. ఇక్కడకూడా టికెట్లు సంపాయించుకుని విజయం సాధించారు. తర్వాత.. ఆ పార్టీపైనే బ్లాక్ మె యిల్ రాజకీయాలు నెరిపారనే వాదన ఉంది.
గత ఎన్నికల్లో తను తప్పుకొని.. తన కుమారుడికి అవకాశం ఇప్పించుకున్నారు. అయితే.. కుమారుడిని ప్రజలు ఓడించారు. ఆ తర్వాత.. వైసీపీ వైపు కుమారుడు చూ సినా.. వద్దని అడ్డుతగిలిన ఈ నాయకుడు.. బీజేపీవైపు అడుగులు వేయాలని భావించారు.
అయితే.. ఇక్కడే 'డీల్' కుదరడం లేదు. తనకు గవర్నర్ పదవి కావాలని.. ఇది ఇస్తానంటే.. జిల్లాలో బీజే పీ బాధ్యతలను తీసుకుంటానని ఆయన చెబుతున్నారు. కానీ, బీజేపీ నాయకులు మాత్రం ఆయన దూకు డు తట్టుకోలేకమని..
ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని చెబుతున్నారు. ఈ విషయం చాన్నాళ్లుగా నలుగు తోంది. అయితే.. దీనిపై బీజేపీ నాయకత్వం.. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. నాన్చుతోంది. దీంతో ఇటీవల సదరు నాయకుడు.. కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు ప్రయత్నించారు.
అయితే..అప్పట్లో కేసీఆర్..ఈయనకు అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో ప్రగతి భవన్ ముందు హల్చల్ చేసి.. కొద్ది సేపటికి విరమించుకున్నారు. అయితే.. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీ పెట్టిన నేపథ్యంలో దానికి మద్దతు ఇచ్చేందుకు ఈయన రెడీగా ఉన్నారు. సీమ రెడ్లను ఏకం చేస్తానని కూడా .. చెబుతున్నట్టు అనంతపురం టాక్. అయితే.. తనకు మాత్రం గవర్నర్ గిరీ ఇప్పించాలనేది ఈయన షరతు. మరి కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ కోసమైనా..ఈయనకు హామీ ఇస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.