క్వీన్ ఎలిజబెత్....... ప్రపంచమంతా గౌరవించే.. ఎంతో అపురూపంగా భావించే మహారాణి. 70 ఏళ్లుగా బ్రిటన్ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం గా ఏలుతున్న మహిళ. బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించి 70 ఏళ్లు గడిచిన సందర్భంగా బ్రిటన్ దేశమంతా ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అతి చిన్న వయసులో బ్రిటన్ రాజా సింహాసనాన్ని అధిరోహించి అత్యంత ఎక్కువ కాలం రాజ్యాన్ని పాలిస్తోన్న మహిళగా ఆమె పేరుపొందారు.
అందరి అమ్మాయిల్లాగే ఎలిజబెత్ కూడా తన కలల రాకుమారుడు రెక్కల గుర్రం పై వచ్చి తీసుకెళ్తాడనుకుంది. కానీ ఆమె కోసం వచ్చింది రాకుమారుడు కాదు.. రాజ సింహాసనం. 26 ఏళ్లకే బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించి.. 96 ఏళ్ల వయసులోనూ రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం గా పాలిస్తున్నారు. క్వీన్` ఎలిజబెత్ మహారాణిగా బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించి 70 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఆ దేశవ్యాప్తంగా `ప్లాటినం జూబ్లీ` ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఎలిజబెత్ పెదనాన్న ఎడ్వర్డ్ 7... వాలిస్ సింప్సన్ అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అప్పటికే ఆమెకు రెండు పెళ్లిళ్లు, విడాకులయ్యాయి. ఆ కాలంలో విడాకులు తీసుకున్నా, భర్త బతికున్న అమ్మాయిని చేసుకోవడం చర్చికి అభ్యంతరకరం. ఎడ్వర్డ్ ప్రేమని ఎవరూ అంగీకరించలేదు. వాలిస్‌ని తాను పెళ్లి చేసుకున్నా.. ఆమెకు మహారాణి హోదా ఉండదని. ఆమె పిల్లలు సింహాసన వారసులుగా ఉండరని ఎడ్వర్డ్ చెప్పినా ఎవరూ ఒప్పుకోలేదు. చివరకు ప్రేమ కోసం ఎడ్వర్డ్ సింహాసనాన్ని వదిలేశాడు. దాంతో ఎలిజబెత్ తండ్రి జార్జికి పదవి దక్కింది. ఆయన మరణం తర్వాత ఎలిజబెత్ రాణి అయ్యారు.
70 ఏళ్లు బ్రిటన్ సామ్రాజ్యాన్ని పాలించినా.. ఆమె ఎప్పుడు పెద్దగా పెదవి విప్పలేదు. మీడియాకు చాలా దూరంగా ఉన్నారు. ఆ దేశ 14 ప్రధాన మంత్రులన్ని చూసిన ఏకైక రాణిగా నిలిచారు. మార్గరెట్ థాచర్ పాలన(1979-90)పాలనపై అప్పట్లో ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు పుకార్లు వచ్చినా.. ప్రభుత్వం పై ఆమె ఎన్నడూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
1947లో ఫిలిప్ రాకుమారుడితో ఎలిజబెత్ పెళ్లి జరిగింది. ఒక రకంగా వారిది ప్రేమ వివాహమే. 99 ఏళ్ల వయసులో ఆయన గత ఏడాది చనిపోయారు.
దేశానికి మహారాణి అయినా.. ఆమె ఆస్తి మాత్రం కేవలం 370 పౌండ్లు మాత్రమే. ఎలిజబెత్ పెద్ద కుమారుడు చార్లెస్ ఇండియా (1980)కు వచ్చినప్పుడు నటి పద్మిని కొల్హాపురి ఆయన్ని ముద్దు పెట్టుకుని సంచలనం సృష్టించారు. ప్రిన్సెస్ డయానా చనిపోయినప్పుడు రాణి పెద్దగా బాధపడ లేదని చెబుతుంటారు కానీ.. డయానా పిల్లలు ఆమె వద్దే పెరుగుతున్నారు.
మహారాణిగా 70 ఏళ్లు పూర్తి చేసుకున్న తమ అభిమాన రాణికి అభినందనలు తెలపడానికి అభిమానులు బకింగ్‌హామ్ ప్యాలెస్ ముందు బారులు తీరారు. బకింగ్‌హమ్ ప్యాలెస్ బాల్కనీలో నుంచుని క్వీన్ ఎలిజబెత్, ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్, ఇతర రాజ కుటుంబీకులు అభిమానులకు అభివాదం చేశారు.