బీచ్ హ్యాండ్ బాల్ పోటీల్లో ఇకపై మహిళలు బికినీ ధరించడం తప్పనిసరి కాదు. ఇటీవల జరిగిన యూరోపియన్ బీచ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్లో బికినీ ధరించలేదని నార్వే మహిళా జట్టుపై భారీ జరిమానా విధించారు. దీనిపై ఆ టీమ్ ఫిర్యాదు చేయగా ఆ నిబంధనను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీచ్ హ్యాండ్బాల్ క్రీడల్లో ఇకపై మహిళలు బికినీ ధరించడం తప్పనిసరి కాదని హ్యాండ్బాల్ క్రీడా సమాఖ్య స్పష్టం చేసింది.
హ్యాండ్బాల్ ఛాంపియన్ షిప్ లో బికినీ ధరించలేదని నార్వే మహిళల హ్యాండ్బాల్ జట్టు కు యూరోపియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ భారీ జరిమానా విధించింది. దీంతో దీనిపై ఫిర్యాదు చేసింది నార్వే. వీరికి మిగతా జట్లు మద్దతుగా నిలవగా మహిళలు బికినీ ధరించడం తప్పనిసరి కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. వారికి నప్పిన దుస్తులు వేసుకునే వీలు కల్పించింది. బల్గేరియాలోని వర్నాలో ఇటీవలే యూరోపియన్ బీచ్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ జరిగింది. ఆ టోర్నీలో పాల్గొన్న నార్వే మహిళలు హ్యాండ్బాల్ జట్టు రూల్స్ కు వ్యతిరేకంగా బికినీ స్థానంలో షార్ట్స్ ధరించి బరిలో దిగారు.
దీంతో సదరు టీమ్పై ఆగ్రహించిన యూరోపియన్ హ్యాండ్ బాల్ సమాఖ్య భారీ జరిమానా విధించింది. 1500 యూరోలు పరిహారంగా కట్టాలని ఆదేశించింది. అంతర్జాతీయ హ్యాండ్ బాల్ సమాఖ్య నిబంధనల ప్రకారం మహిళా అథ్లెట్లు తప్పనిసరిగా బాటమ్ బికినీ ధరించాలి. సైడ్స్ లో బికినీ సైజ్ నాలుగు అంగుళాలను మించకూడదు. అదే విధంగా పురుష అథ్లెట్లు మోకాలికి నాలుగు అంగుళాల పైకి షార్ట్స్ వేసుకునే వెసులుబాటు ఉంది. దీనిపై క్రీడాకారిణుల నుంచి విముఖత వ్యక్తమవగా ఈ రూల్ ను సవరించింది హ్యాండ్ బాల్ సమాఖ్య.