ఆ ఐఏఎస్ అధికారులకు శిక్ష విధించిన హైకోర్టు

Update: 2021-09-15 17:30 GMT
ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరి అనే ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శిక్షను విధించింది. కోర్టుకు హాజరు కాలేదనే కారణంతో పూనం మాలకొండయ్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెరికల్చర్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గతంలో కోర్టును కోరారు.

వారిని రెగ్యులరైజ్ చేయాలని గత ఏడాది ఫిబ్రవరి 28న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఐఏఎస్ లకు కోర్టు శిక్షను విధించింది. అయితే శిక్షాకాలం ఎంత అనే విషయాన్ని ఈ నెల 29న కోర్టు నిర్ధారించనుంది. తమను ఉద్యోగాలను క్రమబద్దీకరించేలా, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల్లో మార్పులు చేయడం వల్ల అర్హత కోల్పోయిన కారణంతో కొందరు అభ్యర్థులు సెరికల్చర్ ఉద్యోగులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు వారిని సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని గత ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఆదేశాలు ఇచ్చింది.

కోర్టు ఆదేశాలను పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరి సకాలంలో అమలు చేయలేదు. దీనితో వారికి కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించింది. విలేజ్‌ హార్టికల్చర్‌ పోస్టుల భర్తీకి 2020 జనవరిలో ఉద్యానవనశాఖ ఓ నోటిఫికేషన్‌‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడంతో ప్రవేశ పరీక్షను రాయడానికి తాము అర్హత కోల్పోయామని 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు, నోటిఫికేషన్‌ని సవరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలని ఆదేశించింది.

అధికారులు ఉత్తర్వులు ఆ అమలు చేయకపోవడంతో 36 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే కేసులో తొలుత హైకోర్టు ఈ ఇద్దరు అధికారుల కు తొమ్మది రోజుల జైలు శిక్ష,జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై వారిద్దరూ తమ వయసు, సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని కోరారు. న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. దీన్ని పునఃసమీక్షించింది. అధికారులు ఉద్దేశపూరకంగా కోర్టు ఆదేశాలను ధిక్కించినట్లు కనిపిస్తోందని, వారికి ఎలాంటి శిక్షను విధిస్తుందనేది ఈ నెల 29వ తేదీన ఖరారు చేస్తుంది.


Tags:    

Similar News