భర్త ‘గే’.. ఊహించని షాక్ ఇచ్చిన భార్య..!

Update: 2022-12-29 16:52 GMT
ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ వ్యక్తి తాను గే అనే విషయాన్ని దాచి పెళ్లి చేసుకున్నాడు. ఇక సంసారం చేయకుండా సాకులు చెబుతూ కాలం గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఆమె తన భర్తను ఎంత ట్రై చేసినా చలించక పోవడంతో ఇదేదో తేడా ఉందని అతడిపై నిఘా పెట్టింది. తీరా అతడు గే అని తెలుసుకొని కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని 2016లో వివాహం చేసుకున్నాడు. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా తన భర్తను దగ్గరకు తీసుకోవడం లేదు. ఎంత ట్రై చేసినా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దీనికితోడు తరుచూ తనపై దుర్భాషలాడుతూ గొడవకు దిగేవాడు. అతడి ప్రవర్తన అనుమానంగా ఉండటంతో అతడిపై భార్య నిఘా పెట్టింది.

ఈ క్రమంలోనే తన భర్త గే అనే విషయాన్ని ఆమె కనిపెట్టింది. ఇతర పురుషులతో తన భర్తకు సంబంధం ఉన్నాయని తెలుసుకుంది. తన భర్త నగ్నంగా ఇతర పురుషులతో దిగిన ఫోటోలను అతడి ఫోన్లో ఉండటాన్ని గమనించింది. వీటినే సాక్ష్యాలుగా కోర్టులో ప్రవేశ పెట్టి తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరింది.

ఆమె వాదనలు.. సాక్ష్యాలను పరిశీలించిన ముంబై కోర్టు ‘గే’ అనే విషయం దాచి మహిళను పెళ్లి చేసుకున్నందుకు పరిహారంగా లక్ష రూపాయలు ఇవ్వాలని.. అలాగే ప్రతినెలా ఆమెకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందించాలని ముంబై మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పును సదరు వ్యక్తి ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు.

అయితే అక్కడ కూడా ఆ వ్యక్తి చుక్కెదురైంది. ఆ మహిళ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన ముంబై సెషన్స్ కోర్టు కింది కోర్టు తీర్పునే సమర్ధించింది. ఆమెకు లక్ష రూపాయలతో పాటు ప్రతి నెలా రూ.15వేలు చెల్లించాల్సిందేనని తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పుపై బాధిత మహిళ సంతోషం వ్యక్తం చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News