మాటలు చెప్పటం వేరు. చేతల్లో చూపించటం వేరు. ప్రభుత్వ నిర్ణయాల్ని లైట్ తీసుకుంటూ.. ప్రజారోగ్యంతో ఆటలు ఆడుకునే ఆసుపత్రులు.. కరోనా వేళ.. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేసే జలగల్లాంటి ఆసుపత్రుల విషయంలో హెచ్చరికలు చేయటం మామూలే. కానీ.. అక్కడితో సరిపెట్టకుండా.. నిబంధనల్ని పాటించని ఆసుపత్రులపై కొరడా విదల్చటం అంత తేలికనైన విషయం కాదు.
ఈ విషయంలో జగన్ ప్రభుత్వం మాటల్లో ఎంత పదునుగా ఉంటుందో.. చేతల్లోనూ అంతే ఉంటుందన్న విషయాన్ని చేసి మరీ చూపించారు. కరోనా వేళ.. కాసుల కక్కుర్తితో రోగుల్ని పీడిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పటం.. ఆ మాటల్ని ఆసుపత్రులు లైట్ తీసుకోవటం చూస్తున్నదే. అందుకు భిన్నంగా.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా కక్కుర్తి ఆసుపత్రులకు షాకివ్వటమే కాదు.. భారీగా జరిమానాలు విధించింది.
ఆరోగ్య శ్రీ పథకం కింద 50 శాతం పడకల్ని ఇవ్వకపోవటం.. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయటం లాంటి పనులు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలకు దిగారు ఏపీ అధికారులు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 52 ఆసుపత్రులకు రూ.3.61 కోట్ల ఫైన్ విధించి షాకిచ్చారు. గడిచిన రెండు రోజుల్లో 35 ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరించే ఏ ఆసుపత్రి పైనైనా చర్యలు తప్పవని తేల్చారు. నిజానికి ప్రభుత్వ మార్గదర్శకాలకు భిన్నంగా ప్రైవేటు ఆసుపత్రులు వ్యవహరించటం..వారికి వార్నింగ్ లు ఇచ్చి ఊరుకోవటమే తప్పించి.. వారిపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సైతం పెద్దగా సాహసించలేని పరిస్థితి. అలాంటిది.. అందుకు భిన్నంగా జగన్ సర్కారు మాత్రం కఠినంగా ఉండటం గమనార్హం.
తాజాగా భారీ జరిమానాలు విధించిన ఆసుపత్రుల్లో కొన్నింటి విషయానికి వస్తే..
- ఆంధ్రా ఆసుపత్రి రూ.56లక్షలు
- నిమ్రా రూ.20లక్షలు
- ఆయుష్ రూ.20లక్షలు
- గాయత్రి ఆసుపత్రి రూ.20లక్షలు
- క్యాపిటల్ ఆసుపత్రి రూ.16లక్షలు
- స్మైల్ ఆసుపత్రి రూ.16లక్షలు
- సన్ రైజ్ రూ.15లక్షలు
- కామినేని రూ.13లక్షలు
- లిబర్టీ ఆసుపత్రి రూ.11లక్షలు
- కేవ్ షైన్ ఆసుపత్రి రూ.10లక్షలు