మ్యాచ్​ ఓడినా ఫీట్‌లతో అదరగొట్టారు..!

Update: 2021-03-13 23:30 GMT
ఇంగ్లండ్​తో జరిగిన టీ20లో టీం ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ మ్యాచ్ లో మనవాళ్లు ఫీట్లు మాత్రం అదరగొట్టాయి. రిషబ్​ పంత్​ రివర్స్​ స్కూప్​ షాట్​తో ఫ్యాన్స్​ను అలరించాడు. ఇక కేఎల్​ రాహుల్​ బౌండరీ లైన్​ వద్ద అద్భుతమైన ఫీల్డింగ్​ చేసి నాలుగు పరుగులు సేవ్​ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. మ్యాచ్​ ఓడినా మాకు ఈ థ్రిల్​ అయినా మిగిల్చారు..అంటూ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.

ఇంగ్లండ్​ తో జరిగిన ఇన్సింగ్స్​లో ఐదో ఓవర్​ను అక్షర్​ పటేల్​ వేశాడు. అక్షర్‌ వేసిన తొలి బంతిని బట్లర్‌ భారీ షాట్‌ కొట్టాడు. బౌండరీ లైన్‌ వద్ద ఉన్న రాహుల్‌ బంతిని క్యాచ్​ పట్టేందుకు గాల్లోకి లేచాడు. బంతి వేగంగా రావడంతో బంతిని అందుకోలేకపోయాడు. కానీ సిక్స్​ వెళ్లకుండా ఆపగలిగాడు. దీంతో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. మరోవైపు రిషబ్​ పంత్​ రివర్స్​ స్కూప్​ షాట్​లో అలరించాడు. ఈ రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి.
ఒకవేళ ఆ బంతిని రాహుల్‌ ఈ క్యాచ్‌ పట్టి ఉంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయి ఉండేదని క్రికెట్​ విశ్లేషకులు అంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రం చేసింది. తర్వాత భారత బ్యాట్స్​మెన్​ ఘోరంగా విఫలమయ్యారు. శ్రేయాస్‌ అయ్యర్‌ (67 పరుగులు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని  చేధించింది. జేసన్‌ రాయ్‌ 49 పరుగులతో జట్టును గెలిపించాడు. మ్యాచ్​ ఓడినా ఫీట్లు మాత్రం ప్రేక్షకులను , నెటిజన్లు థ్రిల్​ చేస్తున్నాయి. టెస్ట్​ సీరిస్​లో అద్భుతంగా రాణించిన టీమిండియా.. టీ20 కి వచ్చేసరికి డీలా పడిపోయింది. తొలి టీ20లోనే ఓడిపోవడంతో విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News