భారత్ కు మిత్రదేశంగా.. తోటి హిందూ దేశంగా అనాదిగా భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపాల్ దేశం తాజాగా ఎదురుతిరిగింది. అక్కడి ప్రధాని చైనా అండతో చెలరేగిపోతున్నారన్న అనుమానాలకు బలం చేకూరేలా పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. భారత్ తో కొత్తగా సరిహద్దు వివాదాన్ని నేపాల్ రాజేసింది.
భారతీయ యాత్రికులు, భక్తులు పవిత్రంగా భావించే టిబెట్ లోని మానస సరోవర్ యాత్రకు ఇన్నాల్లు వ్యయప్రయాసలకు ఓర్చి ప్రయాణించాల్సి వచ్చేది. చైనా భూభాగం నుంచి 9 కి.మీలు నడిచే వెళ్లాల్సి ఉండేది. దీంతో భారత్ ఉత్తరాఖండ్ లోని దర్బులా రోడ్డుకు అనుసంధానించి లిపులేఖ్ పాస్ రోడ్డును ఈనెల 8న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించాడు. దీని ద్వారా మానససరోవర్ కు తొందరగా చేరుకోవచ్చు. వాహనంలోనే ప్రయాణించవచ్చు. ఇదే నేపాల్ అగ్రహానికి కారణమైంది. చిచ్చు రేగింది.
నేపాల్ దేశం దీనిపైన వ్యతిరేకత వ్యక్తం చేసింది. భారత్ లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు తమవి అంటూ తాజాగా కొత్త మ్యాపును నేపాల్ మంత్రిమండలి ఆమోందించి తీర్మానాన్ని పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది నేపాల్ ప్రభుత్వం. గతపాలుకుల మాదిరి తాము భారత్ కు ఆ ప్రాంతాలు విడిచిపెట్టమని.. దక్కించుకుంటామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఊరుకోకుండా ప్రధాని కేపీ శర్మ నేపాల్లో కరోనా వ్యాప్తికి భారత్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రాజేశారు.
కాగా నేపాల్ కొత్త మ్యాప్ పై భారత్ దీటుగా స్పందించింది. నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఈ కొత్త మ్యాప్ ను తాము అంగీకరించబోమని.. ముమ్మాటికీ లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేసింది.
చైనా అండతోనే నేపాల్ చెలరేగిపోతోందని.. వివాదాన్ని రాజేస్తోందని భారత్ అనుమానిస్తోంది. ప్రస్తుతం మానస సరోవర్ యాత్ర కోసం భారత్ వేసిన రోడ్డు చైనా సరిహద్దు వరకు ఉంది. యుద్ధ సమయంలో మన సైనికులు అక్కడికి తొందరగా చేరుకునేలా ఈ రోడ్డు ఉంది. దీంతో రక్షణ పరంగా వూహాత్మకంగా మన దేశానికి ఈ రహదారి కీలకమైంది. అందుకే నేపాల్ తో ఈ ప్రాంతాన్ని దక్కించుకునేందుకే చైనా నాటకాలాడుతోందని.. నేపాల్ ను రెచ్చగొడుతోందని భారత్ భావిస్తోంది. .