మేకప్ కు డబ్బులివ్వట్లేదు.. విడాకులు ఇప్పించండి.. కోర్టు కెక్కిన ధర్మపత్ని
మేకప్ చేయించుకునేందుకు డబ్బులు ఇవ్వట్లేదని ఆరోపిస్తూ.. ఓ భార్య.. తన భర్త నుంచి విడాకులు కోరిన ఘటన ఆసక్తిగా మారింది. అంతేకాదు.. రూ.కోట్లలో పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. భర్త నుంచి విడాకాలు కావాలంటూ.. అలీగఢ్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సహధర్మ చారిణి.
అలీగఢ్‌లోని సివిల్ లైన్ ప్రాంతానికి చెందిన మహిళ(25)కు, ఢిల్లీలో నివాసం ఉండే అమిత్తో 2015లో వివాహం జరిగింది. రెండు సంవత్సరాల పాటు బాగానే ఉన్న వీరిద్దరు.. అనంతరం తరచూ గొడవలు పడుతున్నారు. గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు.
వీరికి పిల్లలు కూడా లేరు. ఇప్పుడు ఆ మహిళ విడాకుల కోసం కోర్టులో అర్జీ పెట్టుకుంది. తన భర్త.. మేకప్కు, జల్సా ఖర్చులకు డబ్బులు ఇవ్వట్లేదని, అందుకే విడాకులు కావాలని పిటిషన్లో పేర్కొంది. రూ. కోట్లలో పరిహారం ఇప్పించాలని అభ్యర్థించింది.
అయితే, దీనిని ఫ్యామిలీ వివాదాల పరిష్కార ట్రైబ్యునల్‌కు కోర్టు బదిలీ చేసింది. "భార్యాభర్తలను కోర్టులో కౌన్సెలింగ్‌కు పిలిచాం. ఇద్దరినీ ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేశాం. అయినా వారిద్దరు కలిసి జీవించేందుకు సిద్ధంగా లేరు. రెండేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు.
జనవరి నెలలో వీరద్దరికి మరోసారి కౌన్సెలింగ్ జరుగుతుంది. వాళ్లను మళ్లీ కలిసి ఉండేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తాం" అని కౌన్సిలెర్ ప్రదీప్ సరస్వత్ తెలిపారు. దేశంలో ఇలాంటి కేసులు తరచుగా వస్తున్నాయని.. చిన్న చిన్న కారణాలకే విడాకులు కోరుతున్నారని సరస్వత్ చెప్పడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.