కొత్త ఒక రోత.. పాత ఒక వింతలా మారింది. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన వస్తువులకు ఇప్పుడు డిమాండ్ బోలెడంత ఉంది. వాటిని వేలం వేస్తే కోట్లు వచ్చిపడుతున్నాయి. ఆపాత వస్తువుల్లో ఏం మహిమ ఉందో కానీ కోట్లు పోసి మరీ కొంటున్నారు. వజ్రాలు వైఢూర్యాలే కాదు.. వాడి పడేసిన ఆనాటి జీన్స్ కు కూడా ఇంత ధర పలకడం ఇక్కడ విశేషమే మరీ..
అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1800ల నాటి లెవీ జీన్స్ జత 76,000 డాలర్లు (భారత రూపాయలలో 62,00,000 పైగా)కి విక్రయించబడింది. శాన్ డియాగోకు చెందిన 23 ఏళ్ల పాతకాలపు దుస్తుల వ్యాపారి కైల్ హౌపెట్, అక్టోబర్ 1న జరిగిన వేలంలో జీన్స్ జతను ఇంత భారీ ధరపెట్టి మరీ కొనుగోలు చేశారు.
మీడియాతో మాట్లాడిన హౌపెర్ట్ "నేను ఇప్పటికీ ఒకరకంగా అయోమయంలో ఉన్నాను, వాటిని కొనుగోలు చేసినందుకు నేనే ఆశ్చర్యపోయాను." ఈ జీన్స్ జతను పాతకాలపు దుస్తుల కంపెనీ డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్‌సన్ విక్రయించారు.
హౌపెర్ట్ వేలం వీడియోను పంచుకున్నారు. "ఇవి తమకు తాముగా మాట్లాడుకుంటాయి" అనే శీర్షికతో జత జీన్స్ ఫోటోను కూడా పంచుకున్నారు. వేలం జాబితా ప్రకారం.. ఈ జంట గోల్డ్ రష్ యుగానికి చెందినవి. పురాతన లెవీస్‌లో ఒకటి..పాతకాలపు డెనిమ్ సేకరణ యొక్క హోలీ గ్రెయిల్ రకానికి చెందిన అరుదైన జీన్స్. ఈ కాలం జీన్స్ సంవత్సరానికే చిరిగిపోతాయని.. 200 ఏళ్లు అయినా చెక్కుచెదరని ఈ జీన్స్ ఇప్పుడు అరుదైనవని అంటున్నారు.
ఇక ఈ ప్యాంట్ ప్రత్యేకత విషయానికి వస్తే.. ఇది చాలా పాతది. అప్పటికీ విమానాలు, ట్రాఫిక్ లైట్స్, రేడియోలు కూడా వాడుకలోకి రాలేదని వాల్ స్ట్రీట్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ప్యాంట్ ను కొన్నేళ్ల క్రితం పశ్చిమ అమెరికాలో ఓ సొరంగంలో గుర్తించారని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.