భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రూ. 75 నాణేన్ని విడుదల చేశారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనేజేషన్( ఎప్‌ఏవో) 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ కాయిన్‌ను రిలీజ్ చేశారు.
అలాగే 17 రకాల కొత్త పంటలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలతో రైతులకు మేలు లుగుతుందన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అందులో భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషమన్నారు.
రైతుకు కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మోదీ తెలిపారు. దేశంలో ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయని.. సరైన వసతులు లేనందువల్ల ఆహార ధాన్యాల నిల్వలు చేసుకోవడం సమస్యగా మారుతోందని అన్నారు.
కాగా ప్రముఖుల జయంతులు, వర్థంతులు, వివిధ దేశంలో ప్రాముఖ్యతనిచ్చే కార్యక్రమాలు, వజ్రోత్సవాలు, వార్షికోత్సవాల సందర్భంగా ఆర్బీఐ ప్రత్యేక నాణేలు విడుదల చేస్తుంది. ఆ మధ్య వాజ్ పేయి పై కూడా ఇలానే కేంద్రం నాణేం విడుదల చేసింది. పలు సేవలందించే వారికి గుర్తుగా కేంద్రం ఈ నాణేలను విడుదల చేస్తోంది.