నెల్లూరు ప‌రాజ‌యం.. రీజ‌నేంటి బాబూ...!

Update: 2021-11-18 11:30 GMT
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న కార్పొరేష‌న్ నెల్లూరు. గ‌తంలో విజ‌య‌వాడ‌, గుంటూరు, విశాఖ కార్పొరేష‌న్ల‌పై టీడీపీ ఆశ‌లు పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు వ‌చ్చి మ‌రీ.. గుంటూరు, విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు.

రాజ‌ధాని సెంటిమెంటును కూడా ర‌గిలించారు. అయితే.. ఆయా కార్పొరేషన్ల‌లో సైకిల్ గెల‌వ‌లేక పోయింది. ఇక‌, ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశం.. నెల్లూరు. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుని.. వైసీపీ స‌ర్కారుపై ప్ర‌జ‌లకు ఉన్న ఆగ్ర‌హాన్ని తాము నిరూపిస్తామ‌ని.. నాయ‌కులు.. ప్ర‌తిజ్ఞ‌లు చేశారు.

ప్ర‌ధానంగా టీడీపీ యువ నాయ‌కుడు లోకేష్‌ను టార్గెట్ చేసిన‌.. మంత్రి అనిల్ కుమార్‌కు గ‌ట్టి స‌మాధానం ఇచ్చేందుకు.. దీనిని అవ‌కాశంగా మార్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే స్థానిక నాయ‌కుల‌తో పాటు.. రాష్ట్ర పార్టీ చీఫ్‌.. అచ్చెన్నాయుడు..మాజీ మంత్రులు నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌.. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి.. వంటివారు కూడా ఇక్క‌డ కీల‌క పాత్ర పోషించారు.

అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ ఇక్క‌డ గెలుపుగుర్రం ఎక్క‌లేక‌పోయింది. నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం అన్ని డివిజన్లలో వైఎస్సార్ సీపీ దాదాపు విజ‌యం ద‌క్కించుకుంది.

మ‌రి దీనికి రీజ‌నేంటి? ఎందుకు ఇలా జ‌రిగింది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చాలా భిన్నంగా.. నెల్లూరు రాజ‌కీయాల‌ను శాసించాల‌ని.. చంద్ర‌బాబు అనుకున్నారు. ఇక్క‌డ‌.. పార్టీని ప‌రుగులు పెట్టించేందుకు వైసీపీలో ఉన్న అస‌మ్మ‌తి నేత‌ల‌ను చేర‌దీస్తున్నార‌ని కూడా.. ప్ర‌చారంలో ఉంది.

అంతేకాదు.. తాజాగా జ‌రిగిన నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ.. టీడీపీ స‌భ్యుల‌కు వీరంతా ప‌రోక్షంగా.. స‌హ‌క‌రిస్తార‌ని అనుకు న్నారు. కానీ, వ్యూహం బెడిసికొట్టిందా? లేక లెక్కే ప‌ట్టుత‌ప్పిందా? ఏదైనా కూడా నెల్లూరు కార్పొరేష‌న్‌లో టీడీపీ లెక్క‌త‌ప్పింది. మ‌రి దీనికి కార‌కులు ఎవ‌రు? ఏం చేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.

వాస్త‌వానికి ప్ర‌తి విష‌యంలోనూ చంద్రబాబు ఆది నుంచి చాలా జాగ్ర‌త్త‌లే తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. నెల్లూరు జారిపోయింది. ముఖ్యంగా బీద ర‌విచంద్ర‌యాద‌వ్‌కు ముందు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే.. త‌ర్వాత‌.. ఆయ‌న‌ను అలా నే ఉంచినా.. రాష్ట్ర‌స్థాయి నేత‌ల‌ను రంగంలోకి దింపారు.

 దీంతో పార్టీలో ఒకింత నేత‌ల మ‌ధ్య దూరం పెరిగింది. అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇక‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి కూడా అన్నీతానై వ్య‌వ‌హ‌రించారు. దీనికితోడు.. వైసీపీ నేత‌ల దూకుడును అడ్డుకోవ‌డంలోనూ నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యారు. వెర‌సి మొత్తంగా.. నెల్లూరులో సైకిల్ మూల‌న‌బ‌డింది. మ‌రి.. ఇప్పుడు పార్టీకి ఫ్యూచర్ ఏంటి? ఏం చేస్తే.. బాగుప‌డుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News