2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ ప్రారంభమైంది. మొదట్లో ఈ యుద్ధం ఒక రెండ్రోజుల్లో ముగుస్తుందని అంతా భావించినా ఉక్రెయిన్ రష్యాను ప్రతిఘటిస్తున్న తీరుతో వార్ కు ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కన్పించడం లేదు. 2022 సంవత్సరం ముగింపుకు వచ్చినా యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉండటం గమనార్హం.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ తక్కువగా అంచనా వేసి ఆ దేశంపై దాడికి దిగినట్లు కన్పిస్తోంది. ఈ క్రమంలోనే రష్యా సైతం తగిన మూల్యం చెల్లించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్ తన అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలోనే రష్యాతో గట్టిగానే పోరాడుతుంది. గత పది నెలలుగా యుద్ధం కొనసాగుతుండటంతో ఇరు దేశాలకు భారీగా ఆస్తి.. ప్రాణనష్టం సంభవించింది.
ఆయుధ సంపత్తిలో మేటిగా ఉన్న రష్యా ఉక్రెయిన్ ను ఓడించేందుకు అపసోపాలు పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. రష్యా వెనక్కి తగ్గితే ప్రపంచ దేశాల ముందు ఆ దేశం పరువు పోవడం ఖాయం. మరోవైపు ఉక్రెయిన్ లో భారీగా ఆస్తినష్టం.. ప్రాణ నష్టం సంభవిస్తోంది. యుద్ధం కారణంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
ఈ యుద్ధం ఉక్రెయిన్ భారీగా నష్టపోతున్నప్పటికీ జెలన్ స్కీ వెనక్కి తగ్గితే ఆ దేశ అస్తిత్వానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో చివరి వరకు జెలెన్ స్కీ వెనుకడుగు వేసే అవకాశం లేవని తెలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ఐరాస. ఇతర దేశాలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ప్రస్తుతం ఇరుదేశాల మధ్య యుద్ధానికి ఎండ్ కార్డు పడాలంటే మాత్రం అందరి చూపు భారత్ వైపు వెళుతోంది. రష్యాతో భారత్ మధ్య మైత్రీ బంధం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. రష్యా నుంచి ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత ఆ దేశంతోనూ భారత్ సన్నిహిత సంబంధాలనే కొనసాగిస్తోంది.
అయితే భారత్ తొలి నుంచి ప్రస్తుత రోజుల్లో యుద్ధాలు సమస్యకు పరిష్కారం కాదని.. ద్వైపాక్షిక చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతోంది. ఇదే విషయాన్ని రష్యా.. ఉక్రెయిన్ దేశాధినేతలకు సైతం భారత్ సూచించింది. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాలు ఇటీవల వరుసగా భారత ప్రధాని మోదీతో మాట్లాడుతుండటం ఆసక్తిని రేపుతోంది.
వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరిగే జీ 20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రష్యా-భారత్ సంబంధాలు.. ఉక్రెయిన్-రష్యా వార్ పై చర్చించారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ సైతం ప్రధాని ఫోన్ చేసి పలు కీలక అంశాలపై చర్చించారు.
జీ 20 సదస్సులో ప్రపంచ శాంతి అంశాన్ని ప్రధానంగా మోదీ చర్చిస్తారని ఆశిస్తున్నట్లు జెలన్ స్కీ తెలిపారు. రష్యా దాడుల్లో చిద్రమైన తమ దేశానికి మానవతా దృక్పథంతో సాయం ప్రకటించడం.. ఐరాసలో తమకు అండగా ఉండటంపై జెలన్ స్కీ భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే రష్యా-ఉక్రెయిన్ వార్ కు ఎండ్ కార్డు పడాలంటే మోదీ పెద్దన్న పాత్ర పోషిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.