మద్యంబాటిల్ లో పాము ... చూడకుండా తాగేశాడు, ఆ తర్వాత ఏమైందంటే !

Update: 2021-04-16 09:30 GMT
దేశంలో ఎక్కువగా దేనికి డిమాండ్ ఎక్కువ అంటే .. అందరూ చెప్పే ఒకే ఒక మాట మద్యం. మద్యం తోనే కొన్ని ప్రభుత్వాలు నడుస్తున్నాయి అంటే మద్యం ఎంత పాత్ర వహిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా లాక్ డౌన్ వేసి , నియమాలు సడలించిన తర్వాత మొదటగా ఓపెన్ చేసింది కూడా మద్యం దుకాణాలే. కొన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది.  అలాంటి రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. సాధారణంగా ఉదయమంతా పనిచేసిన ఓ వ్యక్తి , సాయంత్రం వైన్ షాప్ ‌కు వెళ్లి మద్యం బాటిల్ కొనుక్కొని తాగుతుంటాడు. ఓ వ్యక్తి కూడా అదే పని చేశాడు. అయితే , బాటిల్ అడుగున ఓ పాము పిల్ల ఉండడంతో అతడు షాక్ తిన్నాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే ... అరియాలూరు జిల్లా చుట్టమల్లి గ్రామానికి చెందిన సురేష్ గ్రామంలో  వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం వ్యవసాయ పనులు ముగించుకొని వైన్ షాప్ ‌కు వెళ్లాడు. ప్రభుత్వ ఆధీనంలో నడిచే టాస్మాక్ దుకాణంలో మద్యం బాటిల్ కొని ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత, తాను తచ్చుకున్న మద్యం నుంచి సగం గ్లాస్‌లో పోసుకొని తాగాడు సురేష్. ఆ తర్వాత సీసాలో అతడికి పాము పిల్ల కనిపించింది. సీసా అడుగు భాగంలో చనిపోయిన పాము పిల్ల కనిపించడంతో సురేష్ కి అప్పటివరకు ఎక్కిన కిక్కు మొత్తం దెబ్బకి దిగిపోయింది. సురేష్‌ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అనంతరం, అతడి కుటుంబ సభ్యులంతా వైన్ షాప్ వద్దకు వెళ్లి ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పలేదు. మాకు సంబంధం లేదు. కేవలం మద్యం మాత్రమే అమ్ముతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.
Tags:    

Similar News