మూడు రాజధానులపై సుప్రీంకోర్టు కీలక సూచన

Update: 2021-01-04 12:25 GMT
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ సాగింది. మూడు రాజధానులకు మద్దతుగా హైకోర్టులో తమ వాదన వినలేదని రాయలసీమకు చెందిన కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలో ధర్మాసనం కొట్టివేసింది. చట్టాలను ప్రభుత్వాలు సమర్థించుకుంటాయి కదా అని అశోక్ భూషన్ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కోర్టును ఎలా ఆశ్రయిస్తారని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇక ఏవైనా సంఘాలు పిల్ వస్తే వాటిని పరిశీలించాలని రాష్ట్ర హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచనలు చేసింది. వారి వాదనలు ఖచ్చితంగా వినాలని సూచించింది.

కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులపై గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసింది. అప్పటి నుంచి ఈ అంశంపై హైకోర్టులో విచారణ సాగుతోంది. తాజాగా కొందరు సుప్రీం కోర్టుకు వెళ్లగా మూడు రాజధానుల విషయంలో మద్దతుగా ఏవైనా సంస్థలు పిటిషన్లు వేస్తే పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది.


Tags:    

Similar News