ప్రపంచ యుద్ధంలా కరోనా: సుప్రీంకోర్టు

Update: 2020-12-19 12:24 GMT
కరోనా వైరస్ మహమ్మారిపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనాపై ప్రపంచ యుద్ధం జరుగుతోందని.. దీనివల్ల ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని సుప్రీం కోర్టు పేర్కొంది.

తాజాగా కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పిటీషన్ పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని.. కఠిన నిబంధనలు అమలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. ఎక్కువ జనసంచారం ఉండే ఫుడ్ కోర్టులు, తినుబండారాలు, కూరగాయల మార్కెట్లు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పోలీస్ సిబ్బందిని మోహరించాలని సంబంధిత అధికారులను కోరింది.

కరోనా వ్యాపించే ప్రదేశాల్లో లాక్ డౌన్ విధిస్తే కొన్ని రోజులే ముందే ప్రజలకు తెలియజేయాలని.. తద్వారా వారు ఇబ్బందులు పడకుండా ఉంటారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అధికారులందరూ తప్పనిసరిగా మార్గదర్శకాలకు కట్టుబడి ఆంక్షలు అమలు చేసేలా చూడాలని పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులపై పరిమితి విధించే రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
Tags:    

Similar News