సినిమాకి ఏ మాత్రం తీసిపోని ఒక రియల్ సీన్ హైదరాబాద్ పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక దొంగ పోలీసులకు వీడియో కాల్ చేసి, నా ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు చాలా కష్టపడ్డారు కాబట్టి ఇదైనా , లేకపోతే ఈ అవకాశం ఎవరికీ రాదు అని చెప్పటమే కాదు, మీరు నన్ను పట్టుకోలేరు, నాకు నేనుగా మీకు చిక్కితే తప్పిస్తే అంటూ సవాలు విసిరాడు. అయితే , చివర్లో ఊహించని ట్విస్టు ఇచ్చిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే .. కొన్ని రోజుల క్రితం కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే సినీ నిర్మాత హైదరాబాద్ కు వచ్చిన సమయంలో , బంజారాహిల్స్ లోని పార్కు హయత్ స్టార్ హోటల్లో స్టే చేసిన సమయంలో అయన ఫార్చ్యునర్ కారును హోటల్ పార్కింగ్ లో పార్కు చేయగా, తెల్లారేసరికి ఆ కారు కనిపించకపోవటం సంచలనమైంది. కారులో బంగారు గణపతి విగ్రహం, అలాగే పలు భూములకు చెందిన డాక్యుమెంట్లు ఉన్నాయి. దీనితో మంజునాథ్ వాటికోసం చాలా ఆందోళన చెందాడు. ఈ కేసును ప్రిస్టేజ్ తో తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయటం షురూ చేశారు. ఎంతో కసరత్తు చేసిన తర్వాత ఆ దొంగ మామూలోడు కాదని, ఖరీదైన దొంగతనాలు ఇప్పటికే 56 చేసినట్లుగా అతడిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. విపరీతమైన శ్రమతో అతడిది రాజస్థాన్ అన్న విషయాన్ని గుర్తించారు.
అతడిని ఏదో విధంగా పట్టుకోవాలన్న పట్టుదలతో అతడున్న ఊరికి వెళ్లారు. అతడ్ని పట్టుకున్నామన్న హ్యాపీలో ఉన్న వారికి అనుకోని రీతిలో ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారికి ఒక వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు.. పోలీసులు వెతుకుతున్న ఘరానా దొంగనే. తాను ఎప్పుడూ ఫోన్ చేయనని, ఈసారి చేసినట్లుగా చెప్పిన అతడు.. పోలీసులకు తన తీరుతో షాకుల మీద షాకులు ఇచ్చాడు. మీరు నన్ను అరెస్టు చేయలేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీరు ఏ హోటల్ లో ఉన్నారు. మీకు సమాచారం ఇస్తున్న వాళ్లు ఎవరన్న విషయాలన్ని నాకు తెలుసు. నాకు నేనుగా మీకు దొరకాలే కానీ మీరు నన్ను పట్టుకోలేరు. నా కోసం ఎంతో మంది పోలీసులు గాలిస్తున్నారు. కానీ, వారందరిలోకి మీరే బెస్టు. ఎందుకంటే, నన్ను గుర్తించి ఇంత దూరం రాగలిగారు. అలా వచ్చినోళ్లు కూడా మీరే. అందుకే ఫోన్ చేస్తున్నా. నా ఫోటోను స్క్రీన్ షాట్ తీసుకోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. అంతేకాదు, మీరున్న చోటుకు దగ్గర్లో మాంచి హోటల్ ఉందని పేరు చెప్పి, అక్కడ భోజనం చేయాలని దానికి బిల్ తానే పే చేస్తానని కూడా చెప్పటంతో పోలీసులు అవాక్కు అయ్యారు. ఆ తర్వాత కూడా పోలీసులు తీవ్రంగా రెండు వారాలకి పైగా గాలించి చివరికి అతడిని పట్టుకోలేక వెనుదిరిగారు. దీనితో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.