చీరతోనే ఫుట్ బాల్ ఆడిన ఆ మహిళా ఎంపీ.. జనాలు ఫిదా

Update: 2022-08-18 08:05 GMT
ఆమె ఒక మహిళా ఎంపీ.. చీరకట్టులో ఒద్దికగా ఉంది. చూడడానికే రాజసం ఉట్టిపడుతుంది. అలాంటి ఆమె చీరకట్టులోనే ఏకంగా పుట్ బాల్ ఆడేసింది. అక్కడున్న జనాలను ఫిదా చేసేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఈ ఫీట్ సాధించింది. ఆమె చీరలో ఫుట్ బాల్ ఆడిన వైనం వైరల్ అయ్యింది.

రాజకీయాల్లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగానే నిలుస్తారు. తాజాగా పశ్చిమ బెంగాల్ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆమె యువతలో క్రీడా స్ఫూర్తిని నింపారు. ఖేలా హోబే దివస్ సందర్భంగా ఫుట్ బాల్ ఆడారు. తనలో ఉన్న ఫుట్ బాల్ స్కిల్స్ ను బయటపెట్టారు. ఎంపీ ఫుట్ బాల్ ఆడే స్టైల్స్ కు చాలా మంది నెటిజన్లు ఫిదా అయిపోయి కామెంట్ల వర్షం కురిపించారు.

చీర కట్టుకొని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఫుట్ బాల్ ఆడిన స్టైల్ అక్కడి వారిని ఆకట్టుకుంది. ఒక చేత్లో చీర పట్టుకొని కాలితో ఫుట్ బాల్ తంతున్న ఫొటోలను టీఎంసీ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అయ్యాయి.

ఆ ఫొటోలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. మహువా మొయిత్రా చీర కట్టుకొని.. కాళ్లకు స్నీకర్స్ వేసుకొని కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకొని ఇలా స్టైలిష్ గా ఫుట్ బాల్ ఆడిన తీరు అందరినీ ఫిదా చేసింది.

టీఎంసీ ఆగస్టు 16వ తేదీన 'ఖేలా హోబే దివస్'ను పాటిస్తామని ప్రకటించింది. క్రీడలను ప్రోత్సహించడానికి పార్టీ నాయకులు పశ్చిమ బెంగాల్ అంతటా ఫుట్ బాల్ మ్యాచ్ లను నిర్వహించారు. ఇందులో భాగంగానే తృణమూల్ ఎంపీ మహువా ఈ ఈవెంట్ లో ఫుట్ బాల్ ఆడి సందడి చేశారు. యువత ఎక్కువగా ఈ క్రీడల్లో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. అప్పుడే శారీరక, మానసిక ఆరోగ్యం ధృఢంగా ఉంటుందని చెప్పారు.

బెంగాల్ లో గత అసెంబ్లీ ఎన్నికల వేళ 'ఖేలా హోబ్' అంటూ మోడీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ పెద్ద క్యాంపెయిన్ చేశారు. ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది. ఇప్పుడు దాన్నే పండుగలా చేస్తూ బెంగాల్ లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.
Tags:    

Similar News