ఈ మధ్య కాలంలో ఆడపిలపై ఘోరాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడ చూసిన అమ్మాయి లపై అఘాయిత్యానికి పాల్పడుతుండటం తో అమ్మాయిలు ఇంట్లో నుండి బయటకి రావాలి అంటేనే భయంతో వణికిపోతున్నారు. అలాగే ఉదయం ఇంటి నుండి బయటకి వెళ్లిన అమ్మాయి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేవరకు ..వస్తుందో రాదో అన్న టెంక్షన్స్ లో తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు. అలాగే ఆడవారిపై ఎలాంటి ఘోరాలు జరగకుండా ..ప్రభుత్వం , పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న , కఠిన చట్టాలని అమలు చేస్తున్నప్పటికీ కూడా అమ్మాయిలపై జరిగే దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అమ్మాయిలని టీజ్ చేస్తున్నాడని ..ఒక మహిళా పోలీస్ ఆ యువకుడిని షూ తో చితకొట్టింది. దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిన నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో గురించి పూర్తి వివరాలు చూస్తే ... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. కాన్పూర్‌లో మంగళవారం స్కూల్ కి వెళ్లే అమ్మాయిల కోసం వేచి చూసి ..వారు ఆ రోడ్డు పైకి రాగానే ఏడిపిస్తున్న ఆకతాయిని మహిళ పోలీస్ పట్టుకొని , నడి రోడ్డుపైనే చితకబాదింది. షూ తీసి అతడి దవడలు పగిలేలా కొట్టింది. ‘‘నీకు పిచ్చి పట్టిందా? నీకు అమ్మ, అక్క చెల్లెల్లు లేరా’’ అంటూ ఆ మహిళా పోలీస్ తన ఉగ్రరూపం చూపించింది. అయితే, నేను ఎవరినీ టీజ్ చేయలేదని, తనకు ఏమీ తెలియదని ఆ యువకుడు చెప్తున్నాడు. ఆమె షూ దెబ్బలను తట్టుకోలేక చివరికి కాళ్లు పట్టుకుంటా వదిలిపెట్టమని కోరుతున్నాడు. అయినప్పటికి ఆమె ఆ యువకుడిని వదిలిపెట్టకుండా ..మరోసారి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అంటూ చితకొట్టివదిలింది.