అప్పుడు క్లాస్ మేట్స్.. ఇప్పుడు సీఎంలు

Update: 2018-12-16 08:21 GMT
72 ఏళ్ల వయసు.. 9 సార్లు ఎంపీ గా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ మధ్యప్రదేశ్ సీఎం గా నియామకయ్యారు. కమల్ నాథ్ కు స్వయానా క్లాస్ మేట్ అయిన ప్రస్తుత ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  పక్క రాష్ట్రంలో అధికారంలో ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 54 ఏళ్ల క్రితం వీరిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకోవడం విశేషంగా చెప్పవచ్చు.

వీరిద్దరూ 1964 బ్యాచ్ కు చెందిన వారు. ఉత్తరఖండ్ లోని డూన్ పబ్లిక్ స్కూల్లో చదివారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ కూడా కమల్ నాథ్- నవీన్ పట్నాయక్ క్లాస్ మేట్ కావడం విశేషం.

1980 లో రాజకీయాల్లోకి వచ్చిన కమల్ నాథ్..  మధ్య ప్రదేశ్ నుంచి 9 సార్లు ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.  కాంగ్రెస్ ప్రభుత్వం లో కేంద్రమంత్రి గా కూడా పనిచేశారు. 2009 లో ఒడిషా లో తుఫాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లితే అప్పటి ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరిక మేరకు 20,500 కోట్లు మంజూరు చేసి తన స్నేహ బంధాన్ని కమల్ నాథ్ చాటుకున్నారు. డిసెంబర్ 17న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గా కమల్ నాథ్ ప్రమాణం చేయనున్నారు.

ఇక ఒడిషా ముఖ్యమంత్రి గా చేస్తున్న నవీన్ పట్నాయక్ 1997 లో రాజకీయాల్లో ప్రవేశించారు. 2000 నాటికి ఆయన ఒడిషా ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యారు.  కానీ వీరిద్దరి లో నవీన్ పట్నాయకే ఎక్కువ కాలం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పనిచేయడం విశేషం.
    

Tags:    

Similar News