వెండి తెరపైన క్యూటీగా వెలిగిన ఒక హీరోయిన్ కాలక్రమంలో ఫైర్ బ్రాండ్ నేతగా మారటం అరుదుగా చోటు చేసుకునేదే. అలాంటి అరుదైన పేరును సొంతం చేసుకున్నారు నాటి హీరోయిన్.. నేటి ఇండిపెండెంట్ ఎంపీగా వ్యవహరిస్తున్న నవనీత్ కౌర్. ఆమె.. ఆమె భర్త ఇద్దరూ చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఆమె భర్త మహారాష్ట్రలో ఎమ్మెల్యే కాగా.. ఆమె ఎంపీగా పార్లమెంటుకు ప్రాతనిధ్యం వహిస్తున్నారు. తరచూ ఏదో ఒక అంశంలో వార్తల్లో వచ్చే వీరు.. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను ఇరుకున పడేసే కార్యక్రమానికి తెర తీశారు.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీ బయట హనుమాన్ చాలీసాను పఠిస్తామంటూ నవీనీత్ కౌర్.. ఆమె భర్త రవి రానాలకు ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారు ముందుగా ప్రకటించినట్లే తాము ఉండే ప్రాంతం నుంచి ముంబయికి రైల్లో వస్తామని చెప్పినప్పటికీ.. శివసైనికుల కారణంగా విమానంలో చేరుకున్నారు.
వారితో పాటు దాదాపు 500 మంది కార్యకర్తలు వివిధ మార్గాల్లో ముంబయికి చేరుకున్నట్లు చెబుతున్నారు. ముందు చెప్పినట్లే సీఎం నివాసం బయట హనుమాన్ చాలీసా పఠిస్తామని వారు పేర్కొన్నారు.
దీంతో రంగంలోకి దిగిన శివసైనికులు వారిని లక్ష్యంగా చేసుకొని.. అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముంబయికి చేరుకున్న వారు నందగిరి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. దీంతో.. వారి గెస్టు హౌస్ బయట హనుమాన్ చాలీసా శివసైనికులు పఠిస్తూ షాకిచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఇదిలా ఉండగా.. తాజాగా ముంబయి పోలీసులు ఈ దంపతులకు నోటీసులు ఇచ్చారు. సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠించాలన్న వారి నిర్ణయంపై పోలీసులు ఘాటుగా రియాక్టు కావటంతో ఈ ఫైర్ బ్రాండ్ పొలిటికల్ కపుల్ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.