రైతుల పాద‌యాత్ర‌పై ఇంకా ప‌న్నాగాలే.. వైసీపీ వ్యూహాలు.. ఇవే!

Update: 2022-10-06 07:32 GMT
అమ‌రావ‌తి రైతులు చేస్తున్న మ‌హాపాద‌యాత్ర 2.0పై కింద‌ప‌డ్డా పైచేయి.. అనే టైపులో వైసీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక్క‌డి రైతుల‌ను నిలువ‌రించేలా.. వైసీపీ నాయ‌కులు అనేక వ్యూహాలు ర‌చించారు. వారిని రెచ్చ‌గొడుతున్నారు. ముందు అస‌లు అనుమ‌తులే లేవ‌న్నారు. త‌ర్వాత‌.. రైతులు హైకోర్టుకు వెళ్లి అనుమ‌తులు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో అమ‌రావతి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు పాదయాత్ర చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే జిల్లాలు దాటిపోయారు.

అయితే.. ఈ పాద‌యాత్ర‌పై వైసీపీ నాయ‌కులు మంత్రులు, ఎమ్మెల్యేలు.. సైతం.. తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తు న్నారు. మేం ఆపాల‌ని అనుకుంటే.. ఐదు నిమిషాల ప‌ని అని ఏకంగా.. సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారా య‌ణ వ్యాఖ్యానించారు. ఇక‌, మ‌రో మంత్రి రాజా.. కాళ్లు విర‌గ్గొడ‌తామ‌న్నారు. ఎమ్మెల్సీ.. దువ్వాడ మ‌రో రెండ‌డుగులు ముందుకు వేసి.. అస‌లు ఉత్త‌రాంధ్ర‌లోకి అడుగు కూడా పెట్ట‌నివ్వ‌బోమ‌న్నారు. ఇలా ఎంత‌గా రెచ్చ‌గొట్టినా.. రైతులు మాత్రం త‌మ పాద‌యాత్ర‌ను ఆప‌లేదు.

కానీ, రైతుల పాద‌యాత్ర విజ‌య‌వంతంగా ముందుకు సాగుతుండ‌డంతో వైసీపీ నేత‌ల్లో గుబులు రేగుతోంది. ఏం చేయాలి.. దీనికి కౌంట‌ర్ ఎలా ఇవ్వాల‌నే విష‌యంపై అంత‌ర్మ‌థనం చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే రెండు వ్యూహాల‌ను తెర‌మీదికి తెచ్చారు.

ఒక‌టి వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు.. తాము కూడా పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వ‌డం. ఇదే విష‌యాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు చెప్పుకొచ్చారు. తాము కూడా మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా.. పాద‌యాత్ర చేస్తామ‌న్నారు.

ఇక‌, మ‌రోవైపు.. పార్టీ అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు పాద‌యాత్ర జ‌రుగుతున్న జిల్లాల్లో.. మేధావుల స‌భ‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో కొంద‌రు మంత్రులు.. ఇప్ప‌టికే సభ‌ను ఏర్పాటు చేశారు.

ఎంపీ మార్గాని భ‌ర‌త్ నేతృత్వంలో నిర్వ‌హించిన స‌ద‌స్సులో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, సీదిరి అప్ప‌ల‌రాజు వంటివారు పాల్గొని.. రైతుల‌పై రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లే చేశారు. మ‌రి ఇంత చేసినా.. రైతులు త‌మ పాద‌యాత్ర ఆప‌డంలేదు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌లు వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డమూ మాన‌డం లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ చేస్తున్న ఈ వ్య‌వ‌హారం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంద‌న్న‌దివాస్త‌వం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News