ఆ ఊర్లలో కరోనా లేదు.. కారణం ఏమిటంటే?

Update: 2021-04-24 23:30 GMT
దేశంలో కరోనా ఎలా ప్రబలుతుందో చూస్తున్నాం.. కొన్ని చోట్ల ఆక్సిజన్​ కొరతతో కరోనా బాధితులు మృత్యువాత పడుతున్నారు. గుజరాత్​లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. మరోవైపు మహారాష్ట్రలో విచ్చలవిడిగా కేసులు పెరుగుతున్నాయి.  గుజరాత్​లోని ఓ రెండు గ్రామాలు మాత్రం ఎంతో పకడ్బందీగా కరోనాను కట్టడి చేశాయి. గుజరాత్​లోని షియాల్, అలియా అనే రెండు గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అందుకు కారణం ఆయా గ్రామాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించడమే.

ప్రస్తుతం అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ సహా అనేక పట్టణాల్లో కరోనా కోరలు చాస్తున్నది. రోగులకు ఆస్పత్రులు సరిపోవడం లేదు. ఆయా గ్రామాల్లో సర్పంచ్​ లు తగిన జాగ్రత్తలు పాటించారు. అమ్రేలి జిల్లాలో షియాల్‌ అనే గ్రామం ఉంది. గత ఏడాది నుంచి ఈ గ్రామంలో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఎవరినీ ఊర్లోకి రానివ్వడం లేదు. అంతేకాక గ్రామస్థులందరికీ నిత్యం మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఊరిని శానిటైజ్​ చేస్తున్నారు.

ఊరి వ్యక్తులను కూడా బయటకు వెళ్లనివ్వడం లేదు. అత్యవసరం ఉంటే సర్పంచ్​ అనుమతి తీసుకొని మాత్రమే వేరే ఊరికి వెళ్లాలి. వెళ్లి వచ్చాక కూడా క్వారంటైన్​లో ఉండాలి. దీంతో ఆ ఊరికి కరోనా సోకలేదు.షియాల్ గ్రామంలో 5,551 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామంలోని వాళ్లంతా చేపలు పట్టి జీవనం సాగిస్తుంటారు. అయితే కఠిన ఆంక్షలు పాటించడం వల్ల తమ గ్రామానికి కరోనా సోకలేదని.. సర్పంచ్ హమీర్ భాయ్ తెలిపారు.

అలియా గ్రామంలోనూ....బరూచ్ జిల్లాలోని గ్రామం అలియా. ఈ గ్రామ జనభా మొత్తం 500. ఇక్కడ కూడా ప్రజలు కఠిన నిబంధనలు పాటించడం వల్లే కరోనా నుంచి తమను తాము కాపాడుకోగలిగారు. ఇప్పటివరకు గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.మరోవైపు గుజరాత్​ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో 13,105 కొత్త కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News