అక్క‌డంతా ఒక‌టే పంచాయ‌తీ అట‌.. పంపకాలూ స‌మాన‌మ‌ట‌!!

Update: 2022-10-14 13:30 GMT
రాష్ట్ర వ్యాప్తంగా.. అధికార పార్టీ వైసీపీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రుల మ‌ధ్య ఎన్నోకీచులాట‌లు ఉన్నా యి. ఇవి త‌ర‌చుగా తెర‌మీద‌కి కూడా వ‌స్తున్నాయి. దీంతో ఈ పంచాయ‌తీలు తేల్చ‌లేక‌.. అధిష్టానం.. అనేక సార్లు.. త‌ల‌ప‌ట్టుకుంది. అయితే.. ఇక్క‌డ ఒక‌టి రెండు జిల్లాల్లో మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేద‌ని.. తేలిపోయింద‌ట‌. అదేం చిత్ర‌మో కానీ.. ఈ జిల్లాల్లో.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు(ఈ జిల్లాల‌కు చెందిన వారు) అంతా ఒకే మాట‌.. ఒకే బాట‌గా ఉంటున్నార‌ట‌.

అయితే.. మంచిదే క‌దా!అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది తిర‌కాసు!! ఉమ్మ‌డి చిత్తూరు, ఉమ్మ‌డి విజ‌య నగ‌రం, ఉమ్మ‌డి క‌డ‌ప ఈ మూడు జిల్లాల్లో.. ఎక్క‌డా వివాదాలు లేవు. అంతా క‌లిసిమెలిసి ఉంటున్నార‌ట‌. దీనికి కార‌ణం.. ఇక్క‌డి నేత‌ల్లో ఐక్య‌త ఉంద‌ని కాదు.. పంప‌కాలు.. బాగా జ‌రుగుతున్నాయ‌ట‌! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఒక్క‌రూపాయి వ‌చ్చినా.. నాయ‌కులు బీరు పోకుండా.. క‌లిసి చేసుకుంటున్నార‌ని.. పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇత‌ర జిల్లాల్లోఏది తీసుకున్నా.. మంత్రిపై ఎమ్మెల్యేలు ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఎమ్మెల్యేల‌పై ఎంపీలు.. ఎంపీల‌పై మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. కానీ, ఈ మూడు జిల్లాల్లోల మాత్రం ఎక్క‌డా చ‌డీ చ‌ప్పుడు లేదు. క‌నీసం.. ఎమ్మెల్యే ఇలా చేస్తున్నార‌ని కానీ, మంత్రి త‌మ‌ను ప‌ట్టిం చుకోవ‌డం లేద‌ని కానీ.. ఎవ‌రూ అనరు.

దీనికి కార‌ణం.. అదేన‌ట‌! అంతేకాదు..చిత్తూరులో అయితే.. మ‌రింత జోరుగా ఉంద‌ని చెబుతున్నారు. ఈ జిల్లాలో కీల‌క‌మైన మంత్రి ఒక‌రు ఉండ‌గా.. డిప్యూటీ సీఎం మ‌రొకరు ఉన్నారు. వాస్త‌వానికి చిత్తూరు అంటేనే.. అంతో ఇంతో.. అసంతృప్తులు ఉండాలి.

ఎందుకంటే.. చాలా మంది సీనియ‌ర్లు ప‌ద‌వులు ఆశించి భంగ‌ప‌డ్డారు. అయినా.. ఎక్క‌డా చిన్న కీచులాట బ‌య‌ట‌కు పొక్క‌కు పోగా.. నేత‌లు.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోక‌పోగా.. ఒక‌రినొక‌రు స‌మ‌ర్ధించుకుం టున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎంపీనిఎవ‌రైనా అంటే.. మంత్రి ఫైర్ అవుతారు.

మంత్రిని ఎవ‌రైనా..అంటే.. ఎంపీ యుద్ధానికి దిగిపోతున్నారట‌.ఈ మొత్తం ప‌రిణామాల‌కు కూడా..కార‌ణం.. అంతా 'స‌వ్యం'గా సాగిపోవ‌డ‌మేన‌ని.. వారి వారి ప్రొటోకాల్‌ను బ‌ట్టి.. వారికి 'న్యాయం' జ‌రిగిపోతోంద‌ని అంటున్నారు. ఇదీ.. స్టోరీ!!




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News