ఏపీ అసెంబ్లీ ముట్ట‌డి.. ఎక్క‌డికక్క‌డ ఈడ్చేసిన పోలీసులు

Update: 2022-09-19 08:06 GMT
అసెంబ్లీ వద్ద సోమ‌వారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నం జరిగింది. ప్రభుత్వానివి రైతు వ్యతిరేక విధానాలంటూ నిరసన తెలుపుతూ తెలుగు రైతు అధ్యక్షుడు మార్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో సచివాలయం వద్ద రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రైతుల్ని బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అయిన‌ప్ప‌టికీ..కొంద‌రు రైతులు, రైతు సంఘాల ప్ర‌తినిధులు.. పెద్ద సంఖ్య‌లో ప‌క్క‌నే ఉన్న గోడ దూకి.. అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి చొచ్చుకువెళ్లారు. అయితే.. వీరిని గ‌మ‌నించిన పోలీసులు.. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు కాళ్లు ప‌ట్టుకుని.. ఈడ్చుకుంటూ.. తీసుకువెళ్లి ఆటోల్లో కుక్కేసి.. స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. అదేస‌మ‌యంలో పెద్ద ఎత్తున సెంట్ర‌ల్ బ‌ల‌గాల‌ను సైతం రంగంలోకి దించారు. ఈ క్ర‌మంలో గుంటూరు, కృష్ణాజిల్లాల నుంచి 5000 మందికి పైగా పోలీసులు.. అమ‌రావ‌తికి చేరుకున్నారు.

పోలీసు వాహ‌నాల సైరన్లు.. రైతుల నినాదాల‌తో అమరావ‌తి ప్రాంతం ద‌ద్ద‌రిల్లింది. అంతేకాదు.. ప్ర‌భుత్వంపై ఉద్య‌మించేందుకు వ‌చ్చిన రైతుల‌పై  పోలీసులు లాఠీ చార్జి చేయ‌డాన్ని అన్ని సంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. రైతు రాజ్యం.. రాజ‌న్న రాజ్యం అని చెప్పుకొనే సీఎం జ‌గ‌న్‌.. రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నార‌ని.. కొంద‌రు నాయ‌కులు నిల‌దీశారు. దాదాపు రెండు గంట‌ల పాటు .. అమ‌రావ‌తి ర‌హ‌దారులు అన్నీ.. వాహ‌నాల‌తో నిండిపోయాయి.

ఈ  ప‌రిణామాల మ‌ధ్య .. ప్ర‌జాప్ర‌తినిధులు కొంద‌రు.. కార్లు దిగి.. అసెంబ్లీలోకి న‌డుచుకుంటూ.. వెష‌ళ్లారు. మ‌రికొంద‌రు అధికారులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. పోలీసులు.. క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్టు జీపుల్లోనూ.. ఆటోల్లోనూ ఎక్కించారు. వీరిలో కొంద‌రు ఉద్యోగులు కూడా ఉన్నార‌ని.. అధికారులు చెప్పినా.. ఏదైనా ఉంటే.. స్టేష‌న్‌లో చెప్పాలంటూ..పోలీసులు చెప్ప‌డం గ‌మ‌నార్మం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News