పోల‌వ‌రంపై ఈ ఏడాది తొలిసారి చంద్ర‌బాబు కామెంట్లు ఇవే

Update: 2022-11-30 13:51 GMT
గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌తిసోమ‌వారం.. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌పై స‌మీక్ష చేసేవారు. దీంతో సోమ‌వారానికి ఆయ‌న `పోల‌వారం` అని కూడా పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే, దీనిపై వైసీపీ ప్ర‌బుత్వం నిర్లిప్త‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం. కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌డం.రివ‌ర్స్‌ టెండ‌రింగ్ వెళ్ల‌డం.. కేంద్రం నుంచి నిదులు రాబ‌ట్ట‌లేక పోవడం వంటివి క‌నిపిస్తూనే ఉన్నాయి. దీనిపై అప్పుడ‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తున్నా.. పూర్తిస్థాయిలో చంద్ర‌బాబు స్పందించ‌లేదు.

కానీ, తాజాగా ఈ ప్రాంతంలో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు పోల‌వ‌రంపై స్పందించారు. ఇది ఈ ఏడాదిలో తొలిసారి చంద్ర‌బాబు స్పందించిన‌ట్టు అయింది. జ‌గ‌న్ హ‌యాంలోకి రాష్ట్రం వెళ్తే.. పోల‌వ‌రం ప్రాజెక్టు ముందుకు సాగ‌ద‌నితాను ఎన్నిక‌ల స‌మ‌యంలోనే చెప్పిన విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ``ముద్దులకు  మోసపోవద్దు`` అని హెచ్చ‌రించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.  త‌న  బాధ, ఆవేదన అంతా రాష్ట్రం కోసమేన‌ని చంద్ర‌బాబు చెప్పారు.

త‌న పాల‌న‌ల‌లో ప్ర‌తి నెలా పోలవరానికి వెళ్లి.. ప్రాజెక్టును ప‌రిశీలించి.. ప‌నులు జ‌రుగుతున్న తీరును తెలుసుకున్నాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. త‌న పాల‌న స‌మ‌యంలోనే ఈ ప్రాజెక్టు ప‌నులు 72% పూర్త‌య్యాయ‌ని చెప్పిన చంద్ర‌బాబు  జగన్ పాల‌న‌లో ప్రాజెక్టు ప‌డ‌కేసింద‌న్నారు. ``గ‌త‌ మూడున్నరేళ్లలో డయాఫ్రమ్ వాల్ను బాగు చేయలేదు ఇదేనా.. జ‌గ‌న్ చేసింది?`` అని చంద్ర‌బాబు నిల‌దీశారు. పోల‌వ‌రం నిర్వాసితులకు ప్యాకేజీ, ఆర్ అండ్ ఆర్ ఇవ్వలేదని చెప్పారు.  

రైత‌న్న రాజ్యం.. రాజ‌న్న రాజ్యం అని చెప్పుకొనే జ‌గ‌న్ పాల‌న‌తో అన్న‌దాత‌ల‌పై త‌ల‌పై ఒక్కొక్కరికీ  2ల‌క్ష‌ల 70 వేల చొప్పున అప్పు ఉంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. రైతులు వాడే విద్యుత్‌కు అడుగ‌డుగునా మీటర్లు పెట్టి వారి మెడ‌ల‌కు ఉరితాళ్లు బిగిస్తున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. దీనిని ప్ర‌తి ఒక్క రైతు కూడా ఖండించాల‌ని.. ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News