2024 ఎన్నికల్లో జగన్ నినాదాలు ఇవే!!
ఏపీలో సంక్షేమ అజెండాను నమ్ముకుని పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని రికార్డు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అభివృద్ధి లేదని.. రాజధాని మూలన బడి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ కునారిల్లుతోందనే విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. మరోవైపు.. కనీస మౌలిక సౌకర్యాలు లేకపోవడం.. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను ఎత్తి వేయడం వంటివి వ్యతిరేకత కూడా ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఇక, పన్నుల భారంతో మధ్యతరగతి ప్రజలు మరింత ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో తిరిగి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం.. అధికారం దక్కించుకోవడం వంటివి వైసీపీకి కత్తిమీద సాములానే మారిందనే ది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలోనే ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు, ముఖ్యంగా ప్రస్తుతం సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్నవారి ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా చేసుకునేందుకు వైసీపీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన స్లోగన్ల మాదిరిగానే ఇప్పుడు కూడా ప్రజలకు చేరువ అయ్యేందుకు అంతే మాస్ స్లోగన్లను వైసీపీ రెడీ చేసుకుంది.
గత ఎన్నికలకు ముందు.. `రావాలి జగన్-కావాలి జగన్` నినాదాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లింది. దీనిపై రింగ్ టోన్‌లుకూడా చేసి.. ఫోన్లకు ఫార్వర్డ్ చేసింది. గీతాలు ఆలపించి.. పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. జగన్ పాదయాత్ర సమయంలో అడుగడుగు నా.. ఈ పాటలు పెద్ద ఎత్తున మార్మోగాయి. ఇక, ఆ తర్వాత `బైబై బాబు` నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లింది. పార్టీ కార్యాలయాల ముందే కాదు.. ప్రజల నోట కూడా ఈ స్లోగన్లను పలికించింది. ఇవి మాస్‌ను బాగా ఆకట్టుకున్నాయి. నోటి వెంట జాలువారాయి కూడా!
ఇక, ఇప్పుడు కూడా అదే తరహాలో ఐప్యాక్ సూచనలు, సీఎం జగన్ ఆలోచనలను కలగలిపి రెండు కీలక నినాదాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఒకటి.. `వైనాట్ 175`, రెండు `వైసీపీ లేకుంటే పేదలకు నష్టం` ఈ రెండు నినాదాలను కూడా ప్రజల మధ్యకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే వైనాట్ 175 స్లోగన్ బహిరంగ ప్రదేశాల్లో.. పెద్ద ఎత్తున హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సు కుర్చీల వెనుక కూడా దీనిని ముద్రించారు. వోలా తదితర వాహానాలపైకూడా వీటిని ముంద్రించేలా.. కొన్ని మీడియా చానెళ్లోనూ వీటిని ప్రసారం చేసేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ఇక, రెండో నినాదం.. వైసీపీ లేకుండా పేదలకు నష్టం.. నినాదాన్ని గడపగడపకు వెళ్తున్న నాయకులు, మంత్రులు ప్రజలకు పూస గుచ్చి చెబుతున్నారు.. జగన్ ప్రభుత్వంలో మీకు ఏడాదికి ఇన్ని లక్షల చొప్పున లబ్ధి చేకూరింది.. రేపు జగన్ ప్రభుత్వం రాకపోతే.. ఇన్ని లక్షలు మీరు కోల్పోతారు. వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు జగన్ కోసం కాదు.. మీ కోసం.. ఆలోచించుకోండి! అని నాయకులు ప్రజలకు నూరి పోస్తున్నారు.
ఎన్నికలకు ఏడాదిన్నర ముందే రెండు కీలక స్లోగన్లతో వైసీపీ ప్రారంభించిన ఈ ప్రచారం..ఎన్నికల నాటికి ఇంకెన్ని స్లోగన్లను తీసుకువస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.