క‌రోనాపై పోరులో మ‌న ఆయుధాలు ఇవేః ప్ర‌ధాని

Update: 2021-05-18 13:40 GMT
''స్థానికంగా కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసుకోవడం.. టెస్టులు పెద్ద సంఖ్యలో చేయడం.. ప్రజలకు సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచ‌డం.. క‌రోనాపై పోరులో ఇవే మ‌న ఆయుధాలు'' అని ప్ర‌ధాన మంత్రి మోడీ అన్నారు. కరోనా నియంత్రణ విషయమై అన్ని రాష్ట్రాలు, జిల్లాల అధికారుల‌తో ఇవాళ మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

కొవిడ్ వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచ‌డానికి నిరంత‌రం కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు. వ్యాక్సినేష‌న్ పాల‌సీని మెరుగుప‌రిచేందుకు ఆరోగ్య‌శాఖ ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలిపారు. దేశంలోని వివిధ జిల్లాలో ప‌లుర‌కాల స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని చెప్పిన ప్ర‌ధాని.. వాటి గురించి స్థానికుల‌కే బాగా తెలుస్తుంద‌ని అన్నారు. మీ జిల్లా స‌మ‌స్య‌ల నుంచి మీరు బ‌య‌ట‌ప‌డితే దేశం బ‌య‌ట‌ప‌డిన‌ట్టేన‌ని చెప్పిన మోడీ.. కొవిడ్ పై మీ జిల్లా గెలిస్తే.. దేశం కూడా గెలిచిన‌ట్టేన‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌, క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఎదుర్కొన్న ప‌రిస్థితులు.. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని క‌ష్ట‌మైన స‌మ‌స్య‌ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌డానికి ఉపయోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు. ఇలాంటి స‌మ‌స్య‌లు మ‌ళ్లీ వ‌స్తే.. మెరుగైన కార్యాచ‌ర‌ణ చేసేందుకు ఈ అనుభ‌వం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు.
Tags:    

Similar News