వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని అరవై మంది ఎమ్మెల్యేలు ఒకే కృత నిశ్చయంతో ఉన్నట్టుగా ప్రకటించారు కడప జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తమ ధ్యేయం ఒకటే అని ఆయన ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా కానివ్వకూడదని, లోకేష్ కు అస్సలు ఆ ఛాన్స్ దక్కనీయకూడదని తాము ఫిక్స్ అయినట్టుగా రాచమల్లు వివరించారు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అజెండానే అది అయినప్పటికీ.. అందులోనూ కొంతమంది హార్డ్ కోర్ ఫీలింగ్స్ తో ఉన్నారని రాచమల్లు వ్యాఖ్యానించడం విశేషం. తాము అందరం కలిసికట్టుకుని మాట్లాడుకున్నట్టుగా.. ఇక చంద్రబాబు రాజకీయ జీవితానికి ముగింపును ఇవ్వాలన్నదే తమ ధ్యేయమన్నట్టుగా ఆయన చెప్పారు. చంద్రబాబుకు ఇక అవకాశం రాకుండా చేయడానికి తాము కంకణం కట్టుకున్నట్టుగా వివరించారు.
చంద్రబాబుకు మళ్లీ ఛాన్స్ దక్కనీయకూడదని అనుకోవడంతో పాటు లోకేష్ కు అస్సలు అవకాశమే దక్కనీయకూడదని వీళ్లు ఫిక్స్ అయ్యారట. లోకేష్ ను ముఖ్యమంత్రి కానివ్వమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేల్లో ఒక అరవై మంది ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నట్టుగా రాచమల్లు ప్రకటించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు పొడే గిట్టని వారు గట్టిగానే ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసినా మరి కొందరికి బంపర్ ఆఫర్లు ఇచ్చి కూడా ఆయన కొనుక్కోలేకపోయారు. కాబట్టి.. చంద్రబాబు వ్యతిరేకత అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేల్లో స్వతహాగానే ఉంది. అలాంటి వారే ఇక చంద్రబాబుకు మళ్లీ జీవితంలో అవకాశం రానీయకూడదు, లోకేష్ కు అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదనే ధ్యేయాన్ని పెట్టుకున్నట్టుగా ఉన్నట్టున్నారు.