క‌మ‌లం గూటికి టీడీపీ సీనియ‌ర్ నేత మరియు వార‌సుడు .. ?

Update: 2019-08-17 04:54 GMT
తెలంగాణ‌లో టీడీపీకి చెందిన మ‌రో కీల‌క నేత, ఆయ‌న కుమారుడు బీజేపీలో చేరుతున్నారా..? ఇప్ప‌టికే తండ్రీకొడుకులు క‌మ‌లం పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారా..?  రెండుమూడు రోజుల్లోనే ఈ విష‌యంలో క్లారిటీ రానుందా..? అంటే తాజాగా క‌నిపిస్తున్న ప‌రిణామాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా తెలంగాణ‌లో పాగా వేయాల‌ని చూస్తున్న క‌మ‌లద‌ళం కాంగ్రెస్‌, టీడీపీల‌తోపాటు అధికార టీఆర్ ఎస్ పార్టీల్లోని కీల‌క నేత‌ల‌ను లాగేసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మైన విష‌యం తెలిసిందే.

ఇందులో భాగంగానే.. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌ల‌ను పార్టీలో చేర్చుకుంది. ఈ వ‌రుస‌లోనే టీడీపీకి చెందిన మ‌రో కీల‌క నేత‌తోపాటు ఆయ‌న కుమారుడిని కూడా పార్టీలో చేర్చుకుంటుంద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. ఇంత‌కీ ఆ తండ్రీకొడుకులు ఎవ‌ర‌ని అనుకుంటున్నారు. మారు మ‌రెవ‌రో కాదు.. తెలంగాణ‌లో ఒక‌ప్పుడు కీల‌క నేత‌గా వెలుగు వెలిగిన, మాజీ మంత్రి, మాజీ ఎంపీ దేవేంద‌ర్‌ గౌడ్‌, ఆయ‌న కుమారుడు వీరేంద‌ర్‌ గౌడ్‌. ఇక దేవేంద‌ర్‌గౌడ్ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కీల‌క ప‌ద‌వి హోంశాఖ మంత్రిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు.

అలాగే.. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా కొన‌సాగారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులు. పార్టీతోపాటు, టీడీపీ ప్ర‌భుత్వంలో కూడా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబుకు కొంత దూరంగా ఉంటూ వ‌చ్చారు. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యంలో సొంతంగా ఓ పార్టీని కూడా స్థాపించి, ముందుకు న‌డిపించ‌లేక పోరారు. ఆ త‌ర్వాత ప‌లు పార్టీలు మారి.. చివ‌రికి మ‌ళ్లీ టీడీపీ గూటికి చేరిపోయారు. మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి దేవేంద‌ర్‌గౌడ్ కుమారుడు వీరేంద‌ర్‌గౌడ్ పోటీ చేసి ఓడిపోయారు.

అయితే.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారినా.. వ్య‌క్తిగ‌తంగా మాత్రం దేవేంద‌ర్‌గౌడ్ త‌న సామాజిక‌వ‌ర్గంలో మంచి ప‌ట్టును కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నతోపాటు కుమారుడిని కూడా పార్టీలోకి తీసుకుంటే.. బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో బీజేపీ పెద్ద‌లు ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే స‌మ‌యంలో మ‌ళ్లీ రాజ‌కీయ పున‌ర్వైభ‌వం పొందాలన్నా, త‌న‌కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ బాగుండాల‌న్న‌ బీజేపీలో చేర‌డం ఒక్క‌టే ఏకైక మార్గ‌మ‌ని దేవేంద‌ర్‌గౌడ్ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  



    
    
    

Tags:    

Similar News