చేపల పులుసు తిని నిద్రపోయిన దొంగ !

Update: 2020-06-16 23:30 GMT
దొంగతనానికి వెళ్లిన ఏ దొంగ అయిన కూడా ఏం చేస్తాడు. ఆ ఇంట్లోని వారు చూడకుండా వచ్చిన పనిలో భాగంగా నగలు, నగదు కనపడిన సొత్తు మొత్తం దోచుకొని చిటికెలో బయటకి వచ్చేస్తాడు. కానీ , ఓ దొంగ మాత్రం అలా చేయలేదు. దొంగతనానికి వెళ్లి, ఆ ఇంట్లో  చేపల పులుసు కనపడగానే కడుపునిండా తిని అక్కడే పడుకొని నిద్రపోయాడు. ఈ సంఘటన  తమిళనాడులో జరిగింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ...తమిళనాడు రాష్ట్రం కన్నియాకుమారి జిల్లా పరైకోడు గ్రామంలో సతీష్ అనే ఓ దొంగ అక్కడ ఓ ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు. అయితే , ఆ ఎంతో ఎంత వెతికినా కూడా  డబ్బు, నగలు ఏమీ కనపడలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగాడు. ఇంతలో అతనికి కిచెన్ లో కమ్మగా వండి పెట్టిన చేపల పులుసు వాసన వచ్చింది.  అసలే ఆకలితో ఉన్నాడు. దీనితో ఏమి ఆలోచించకుండా వంటగదిలోకి దూరి చేపలు పులుసు వేసుకుని ఫుల్లుగా తిన్నాడు. భుక్తాయాసం ఎక్కువై, డాబాపైకెళ్లి కాసేపు పడుకుని తెల్లవారుజామునే  వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. కానీ.. తెల్లవారినా లేవలేకపోయాడు. డాబాపై నిద్రపోతున్న దొంగను గమనించిన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 


Tags:    

Similar News