మొబైల్స్ ఫోన్స్ దొంగతనం చేయడం తరచుగా జరుగుతుంటాయి. అలాగే ఒకేసారి కొన్ని ఎక్కువ మొబైల్స్ దొంగతనం జరిగిన సంఘటనలు కూడా మనం చూసివుంటాం. అయితే , అది అప్పట్లో , ఇప్పుడు రోజులు మారిపోయాయి. కొంతకాలంగా మొబైల్ ఫోన్స్ దోపిడీలోకి మహాకేటుగాళ్లు, జాదూగాళ్లు ఎంట్రీ ఇచ్చేశారు. ఎన్నిసార్లని ఒకటి , రెండు మొబైల్స్ కొట్టేస్తే మన లైఫ్ సెట్ అవుతుంది. ఇలా అయ్యేది కాదు కొడితే కుంభకోణమే అని నిర్ణయం తీసుకోని ఏకంగా కంటైనర్లకు కంటైనర్లే లేపేస్తున్నారు. ఫ్యాక్టరీలనుంచి గొడౌన్లకు చేరకుండా మార్గమధ్యలోనే తమ చేతుల్లోకి తీసుకుని సైలెంట్ గా ఆ పని ముగిస్తున్నారు.
ఈ తరహా ఘటనలు తమిళనాడు లో ఎక్కువైయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో మరొకటి జరిగింది. కృష్ణగిరి జిల్లాలోని జాతీయ రహదారిపై ప్రముఖ మొబైల్ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్స్ తో గోడౌన్ కి వెళ్తున్న కంటైనెర్ ను లేపేశారు. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ నుంచి ముంబయికి ఎంఐ మొబైల్స్ ను తీసుకెళుతున్న కంటైనర్ పై పంజా విసిరిన దొంగలు.. కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపంలో కంటైనర్ ను అడ్డుకున్నారు. డ్రైవర్లను చిత కబాది సుమారు 15 కోట్ల రూపాయల విలువైన మొబైల్స్ ను తీసుకోని వెళ్లిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోపిడీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు జరగడంతో ఆ నేరాలకు, ఈ దోపిడీకి ఏమైనా సంబంధం ఉందా అనేకోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు.