శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనే సామెత ఊరికే రాలేదు. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పుతోనే చట్టబద్దంగా అధికారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఓ బార్ ఓనర్. జాతీయ రహదారికి 500 మీటర్ల లోపు ఉన్న వైన్ షాపులు - బార్లను మూసేయాలని సుప్రీం కోర్టు ఇటీవల సంచలన తీర్పు వెల్లడించిన విషయం విదితమే. అయితే కర్ర విరగకుండా, పాము చావకుండా అన్న చందంగా ఓ బార్ ఓనర్ తెలివిగా వ్యవహరించాడు. సదరు నిబంధనను పాటించేలా, బార్ షాపు రహదారి పక్కనే ఉండేలా ఓ చిత్రమైన ఆలోచన చేశాడు. అదేమిటంటే...
సాధారణంగా మనం ఆలయాల్లోకి వెళ్లినప్పుడు దైవ దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి చూస్తాం కదా. ఆలయ ప్రాంగణంలోనే అక్కడికక్కడే అనేక మలుపులు తిరుగుతూ చివరకు దైవ దర్శనం చేసుకుంటాం. అయితే సరిగ్గా అలాంటి క్యూలైన్లనే నిర్మించాడు ఆ బార్ ఓనర్. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో జాతీయ రహదారి 17కు ఆనుకుని ఉన్న ఐశ్వర్య అనే బార్ కు చేరుకునేందుకు దాని ఓనర్ 300 మీటర్ల క్యూ లైన్ ఏర్పాటు చేశాడు. ఆ క్యూలైన్ మొత్తాన్ని కాంక్రీట్ గోడగా నిర్మించాడు. అతని షాపు సదరు జాతీయ రహదారికి 200 మీటర్ల దూరంలో ఉంది. అతను నిర్మించిన క్యూలైన్ పొడవు 300 మీటర్లు. మొత్తం 500 మీటర్లు, ఇంకేముంది లెక్క సరిపోయింది కదా. సుప్రీం కోర్టు పెట్టిన నిబంధన కూడా ఇదే. దీంతో అతని తెలివికి సంబంధిత అధికారులే షాక్ తిన్నారు.
వైన్ షాపులు - బార్లు 500 మీటర్ల లోపు ఉండరాదన్నది నిబంధన, కానీ అది నేరుగా ఉండాలా, వంకర్లు తిరుగుతూ ఉండాలా అన్నది చెప్పకపోవడంతోనే తాను ఇలా చేశానని అంటున్నాడు బార్ ఓనర్. మరి మద్యం సేవించిన వారు రోడ్డు బాగా ఉంటేనే తూలుతూ నడుస్తారు కదా. ఇక ఇలాంటి పజిల్ లా దారి ఉంటే అందులో నుంచి తప్పించుకుని బయటకు వస్తారా.. అనే సందేహం మీకు వచ్చిందా? దానికి కూడా ఈ బార్ ఓనర్ ఏదైనా ప్లాన్ కనిపెడ్తారేమో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/