సుడిగాడ‌న్న పేరుకు అత‌డెంతగా సూట్ అవుతాడంటే?

Update: 2019-04-30 01:30 GMT
అదృష్ట‌వంతుడ్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు.. దుర‌దృష్ట‌వంతుడ్ని ఎవ‌రూ కాపాడ‌లేర‌ని ఊరికే అన‌రేమో. టైం బాగున్న‌ప్పుడు.. ప‌క్క‌న బాంబు పేలినా ఏమీ కాదు. అదే టైం బాగోలేకపోతే.. టెంకాయ సైతం టైంబాంబ్ లా మారి ప్రాణాలు తీసే ప‌రిస్థితి. తాజాగా చెప్పే ఈ సుడిగాడు గురించి వింటే.. నిజంగానా? అన్న ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఇటీవ‌ల శ్రీ‌లంక‌లో చోటు చేసుకున్న దారుణ ఉగ్ర‌దాడిలో వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోవ‌టం తెలిసిందే.

అయితే.. ఈ దాడి నుంచి తృటిలో త‌ప్పించుకున్న అభిన‌వ్ చారి అనే వ్య‌క్తి ఉదంతం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. దుబాయ్ లో నివ‌సించే ఎన్నారై అభిన‌వ్ చారి.. ఇప్ప‌టివ‌ర‌కూ రెండుసార్లు ఉగ్ర‌దాడి నుంచి తృటిలో త‌ప్పించుకోవ‌టం గ‌మ‌నార్హం.

దుబాయ్ నివాసి అయిన అభిన‌వ్ చారి.. త‌న భార్య న‌రూప్ తో క‌లిసి బిజినెస్ ట్రిప్ లో భాగంగా శ్రీ‌లంక‌కు వెళ్లారు. కొలంబోలోని సిన‌మ‌న్ గ్రాండ్ హోట‌ల్లో బ‌స చేశారు. ఈస్ట‌ర్ ప‌ర్వ‌దినాన చ‌ర్చికి వెళ్లిన ఆయ‌న‌.. అక్క‌డ నుంచి తిరిగి హోట‌ల్ కు వ‌చ్చే క్ర‌మంలో బ‌య‌ట బాంబు పేలుళ్ల‌తో దారుణ ప‌రిస్థితి నెల‌కొని ఉంది. దీంతో బెంబేలెత్తిపోయిన ఆయ‌న‌.. హోట‌ల్ కు చేరుకున్నారు.

ఆయ‌న‌.. ఆయ‌న స‌తీమ‌ణి హోట‌ల్ కు చేరుకోవ‌టానికి కాసేప‌టి ముందే బాంబుపేలుళ్లు చోటు చేసుకున్నాయి. యూఏఈ నుంచి రెండు సార్లు మాత్ర‌మే బ‌య‌ట దేశాల‌కు వెళ్లాన‌ని.. ఆ రెండుసార్లు ఉగ్ర‌దాడి నుంచి తృటిలో త‌ప్పించుకున్న‌ట్లు చెప్పారు. ముంబ‌యి బాంబుపేలుళ్ల నుంచి తృటిలో త‌ప్పించుకున్న ట్రాక్ రికార్డు ఇత‌గాడి సొంతం.

తొలుత బ్రేక్ ఫాస్ట్ చేద్దామ‌నుకున్నామ‌ని.. కానీ.. చ‌ర్చికి వెళ్లి ప్రార్థ‌న‌ల అనంత‌రం టిఫిన్ చేద్దామ‌ని అనుకోవ‌టం తాము ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్లుగా చెప్పారు. ఉగ్ర‌దాడుల నుంచి తాను.. త‌న భార్య తృటిలో త‌ప్పించుకోవ‌టంపై ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఈ ఉదంతం మొత్తం విన్న‌ప్పుడు.. అభిన‌వ్ లాంటి సుడిగాడు ప్ర‌పంచంలో అతి కొద్దిమందే ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News