కొండలు - గుట్టలు - పర్వతాల్లో గుహలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. హిమాలయాలు వంటి చోట్ల గుహల్లో స్వామీజీలు తపస్సులు చేస్తారని చెబుతారు.. మనకు నిత్యం కనిపించే కొండలు - గుట్టల్లోని గుహల్లోకి వెళ్తే మాత్రం నక్కలు - తోడేళ్లు - ఇతర జంతువులే కనిపిస్తాయి. హిమాలయ సానువుల్లో అమర్ నాథ్ లో మంచులింగం గుహలోనే ఉంటుంది. అయితే.. చైనాలోని ఒక గుహలో ఏకంగా ఒక ఊరే ఉందంటే నమ్ముతారా.. నిజం.. 100 మంది అక్కడ నివసిస్తున్నారు. వారందరికీ గుహే గ్రామం. అక్కడే ఆడుకోవడానికి మైదానాలు - చదువుకోవడానికి స్కూలు కూడా ఉన్నాయి. అంత పెద్ద గుహ అది.
చైనాలోని గిజూ ప్రావిన్సులోని జోంగ్ డాంగ్ గ్రామం ఒకటుంది. ఇది మొత్తం పర్వతాల్లోని గుహలోనే ఉండడం విశేషం. సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తున ఇది ఉంది. కింద నుంచి అక్కడికి చేరుకోవాలంటే గంటల కొద్ది పర్వతమార్గాల్లో ప్రయాణించి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ గుహలో ఒక పాఠశాల కూడా ఉండేది. కానీ... చైనా ప్రభుత్వం దాన్ని 2008లో మూసేసింది. దాంతో అక్కడున్న పిల్లలు పర్వతం కింద ఉన్న గ్రామాల్లోని బడులకు వెళ్లి వస్తున్నారు. ఉదయం రెండు గంటల పాటు - సాయంత్రం రెండు గంటల పాటు ప్రయాణిస్తే కానీ వారికి చదువుకునే అవకాశం ఉండడం లేదు.
చాలాకాలం పాటు మిగతా ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ గుహ గ్రామం ఇప్పుడిప్పుడే ప్రపంచంతో కనెక్టవుతోంది. రోడ్లు లేకపోవడం, సమాచార వ్యవస్థ లేకపోవడంతో వారంతా బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు. అయితే, కొద్దికాలం కిందట అక్కడికి టీవీలు వచ్చాయి.. అప్పుడప్పుడు వార్తా పత్రికలు కూడా వెళ్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ గుహ గ్రామం గురించి తెలియడంతో పర్యాటకులు వస్తుంన్నారు. దీంతో రోడ్లు - కమ్యూనికేషన్లు డెవలప్ అవుతున్నాయి.