ఈట‌లను ఎదుర్కొనేందుకు కేసీఆర్ వ్యూహం ఇదే!

Update: 2021-06-13 03:30 GMT
టీఆర్ ఎస్ మాజీ నేత‌.. మాజీ మంత్రి.. ఈట‌ల రాజేంద‌ర్‌.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్న ఈట‌ల‌.. ఆ పార్టీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి ఉప ఎన్నిక‌లో పోటీ చేసి విజ‌యం సాధించ‌డం ద్వారా టీఆర్ ఎస్ అదినేత‌, సీఎం కేసీఆర్‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారాల‌ని భావిస్తున్నారు. అయితే.. కేసీఆర్ కూడా ఇదే త‌ర‌హాలో ఈట‌ల‌కు చెక్ పెట్టాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈట‌ల బ‌లాబ‌లాల‌పై కేసీఆర్ స్వ‌యంగానే క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈట‌ల విష‌యాన్ని తీసు కుంటే.. రాజ‌కీయ నేత‌గా కంటే కూడా తెలంగాణ ఉద్య‌మ నేత‌గా ఆయ‌న ప్ర‌జ‌ల గుండెల్లో ఉన్న మాట వాస్త వం. దీంతో ఈ సెంటిమెంటు.. ఈట‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలో కేసీఆర్ కూడా ఇంతే వ్యూహంగా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అంటే.. అటు రాజ‌కీయంగానే కాకుండా.. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన వారిని ఈట‌ల‌కు పోటీగా నిల‌బెట్టి.. ఆయ‌న‌కు చెక్ పెట్టాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు.

వాస్త‌వానికి తెలంగాణ ఉద్య‌మం సాగిన‌ప్పుడు.. కేసీఆర్‌కు.. త‌ర్వాత‌.. రాష్ట్ర సాధ‌న‌, టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత‌.. కేసీఆర్‌కు చాలా తేడా ఉంద‌ని అంటారు ప‌రిశీల‌కులు. ఉద్య‌మంలో త‌న‌తో క‌లిసి న‌డిచిన వారిని చాలా మందిని ఆయ‌న ప‌క్క‌న పెట్టారు. అదేస‌మ‌యంలో అధికార పార్టీ నేత‌గా.. ఆయ‌న రాజ‌కీయంగానే అడుగులు వేసి.. ఇత‌ర పార్టీల‌ను అడ్ర‌స్ లేకుండా చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రె స్ త‌ర‌పున గెలిచిన వారిని పార్టీలో చేర్చుకుని మంత్రి ప‌ద‌వులు కూడా క‌ట్టబెట్టారు.

అంటే.. కేసీఆర్ ఉద్య‌మ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టార‌నే వాద‌న బ‌లంగా ఉంది. ఈ క్ర‌మంలో ఈట‌ల వంటి బ‌ల‌మైన ఉద్య‌మ నేత‌, తెలంగాణ ఉద్య‌మంతో మ‌మేక‌మైన నేత‌ను కూడా అంతే ఈజీగా ప‌క్క‌న పెట్టారు. కానీ, ఇప్పుడు అదే ఉద్య‌మ నేత కోసం కేసీఆర్ త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఈట‌లకు రాజ‌కీయ బ‌లంతోపాటు ఉద్య‌మ నేత‌గా ఉన్న బ‌లం ఎక్కువ‌. ఈ సెంటిమెంట్‌నే ఈట‌ల కూడా న‌మ్ముకున్నారు. ఉద్య‌మ నేత‌గా ప్ర‌జ‌ల‌తో త‌న‌కున్న అనుబంధం ఇప్పుడు సానుకూలంగా మారి.. విజ‌యం ద‌క్కేలా చేస్తుంద‌ని భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌.. ఈట‌ల‌కు చెక్ పెట్టేందుకు ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న నేత కోసం స్వ‌యంగా ప‌రిశీల‌న చేస్తున్నార‌ని తెలుస్తోంది. అదేవిధంగా ఉద్య‌మ స‌మ‌యంలో యాక్టివ్‌గా ఉన్న యువ నేత‌ల‌ను, సీనియ‌ర్ల‌ను కూడా కేసీఆర్ ఉప ఎన్నిక ప్ర‌చార ప‌ర్వంలోకి దింపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో హుజారాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఏకంగా.. జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా.. ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించేందుకు కేసీఆర్ చాలానే క‌ష్ట‌ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏమేర‌కు విజ‌యం సాధిస్తారో చూడాలి.
Tags:    

Similar News