కోవిడ్ నుంచి కాపాడేందుకు ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్ తదితర టీకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో ఇప్పుడు ప్రముఖ ఫార్మా కంపెనీ.. భారత్ బయోటెక్ ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు (నాసల్ వ్యాక్సిన్) ఇన్‌కోవాక్ (iNCOVACC) ను రూపొందించింది. ఈ నాసల్ వ్యాక్జిన్ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతి కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్‌కోవాక్ (iNCOVACC)కు అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. దేశంలో అనుమతి పొందిన తొలి నాసల్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం.
ఈ మేరకు భారత్ బయోటెక్ రూపొందించిన నాసల్ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఇన్‌కోవాక్ (iNCOVACC) వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరు చేశామన్నారు. కోవిడ్‌పై భారత్ సాగిస్తున్న పోరును భారత్ బయోటెక్ రూపొందించిన నాసల్ వ్యాక్సిన్ మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగం, అందరి సహకారంతో భారత్ సమర్థంగా కోవిడ్‌ను ఓడిస్తోందన్నారు.
కాగా నాసల్ వ్యాక్సిన్‌కు సంబంధించి సుమారు నాలుగు వేల మంది వలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని భారత్ బయోటెక్ తెలిపింది. ఇందులో ఎవరిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ గానీ, దుష్ప్రభావాలు కనిపించలేదని ఆ కంపెనీ వెల్లడించింది. కాగా నాసల్ వ్యాక్సిన్ ను ముక్కు రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.
ముక్కు ద్వారా ఇచ్చే ఈ చుక్కల మందు పూర్తిగా సురక్షితమైందని.. కోవిడ్‌ను సమర్థంగా నిరోధిస్తోందని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ మేరకు ఇటీవల మూడో దశ ప్రయోగాల ఫలితాల సందర్భంగా వివరించింది. ప్రయోగాల్లో భాగంగా ఈ నాసల్ వ్యాక్సిన్‌ను ప్రైమరీ వ్యాక్సిన్‌గానూ, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోసు గానూ ఇచ్చామని వెల్లడించింది. వీటిలో మెరుగైన ఫలితాలు వచ్చాయని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.
కొన్ని మార్పులు చేసిన చింపాంజీ అడినోవైరస్ వెక్టార్ సాయంతో నాసల్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆ కంపెనీ తెలిపింది. ఇందుకు అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూయిస్ సహకారం తీసుకున్నామని వెల్లడించింది.
మరోవైపు తాము తయారుచేసిన నాసల్ వ్యాక్సిన్‌కు కేంద్రం అత్యవసర అనుమతులు ఇవ్వడంపై
భారత్ బయోటెక్ హర్షం వ్యక్తం చేసింది. కోవిడ్ నియంత్రణకు తాము తయారు చేసిన చుక్కల మందుకు అనుమతులు లభించడం గర్వంగా ఉందని భారత్ బయోటెక్ ఎండీ, చైర్మన్ డాక్టర్ కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. భవిష్యత్‌లో సంభవించే అంటు వ్యాధులను ఎదుర్కొనేందుకు నాసల్ వ్యాక్సిన్ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.