ప్రపంచంలోనే నిశ్శబ్ధ ప్రాంతం ఇదే..! మీ గుండె, ఇతర భాగాల చప్పుడూ వినొచ్చు..!

Update: 2020-12-13 23:30 GMT
నిశ్శబ్ధం అంటే మామూలు నిశ్శబ్ధం కాదిది.. కటిక నిశ్శబ్ధం. ఎప్పుడైనా మీరు ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో నిశ్శబ్ధాన్ని చూసి ఉంటారు. గడియారం చిన్నముల్లు చేసే టక్​టక్​ మని శబ్ధం వినిపించొచ్చు. కానీ మన గుండెచప్పుడు మాత్రం వినిపించదు. ప్రపంచంలో ఓ ప్రదేశం ఉంది. అక్కడ ఉండేది పిన్​డ్రాప్​ సైలెంట్​ కూడా కాదు. అంతకంటే ఎక్కువే. ఎందుకంటే మన గుండెచప్పుడు మనకు వినిపిస్తుంది. గుండె చప్పుడే కాదు.. మన శరీరంలోపలి భాగాలు చేసే చప్పుడు కూడా మనకి వినిపిస్తుంది

. ఆ ప్రదేశం ఎక్కడుందంటే.. అమెరికాలో ఏర్పాటైన ఒర్ఫీల్డ్ ల్యాబొరేటరీస్ అనే సౌండ్ డిజైన్ స్టూడియోలోని ఓ చాంబర్. ఇక్కడ చీమ చిటుక్కుమన్న వినిపిస్తుంది. అందుకు కారణం అక్కడ ఉండే నిశ్శబ్ధం. బహుశా ప్రపంచంలోని మరేచోట కూడా ఇంత నిశ్శబ్ధం ఇప్పటివరకు ఎవరూ సృష్టించలేదు. అయితే ఈ స్టూడియోను సంగీత వాయిద్య పరికరాల నాణ్యతను పరిశీలించేందుకు ఉపయోగిస్తారు. అంతరిక్షంలోని నిశ్శబ్దాన్ని తట్టుకోవడానికి వ్యోమగాములు సైతం ఈ చాంబర్ లోనే ట్రైనింగ్ తీసుకుంటారు. ఇక్కడ అంత నిశ్శబ్ధం ఉండటానికి కారణం ఈ గదికి అమర్చిన గోడలు.. ఆ గోడలు బయటి శబ్ధాన్ని లోపలికి రానివ్వవు.

చాంబర్ లోపల శబ్ధస్థాయి - 9.4 డెసిబుల్స్ మాత్రమే ఉంటుంది. దీంతో మన శరీర భాగాలు చేసే చప్పుడు మనకు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరూ ఎక్కువసేపు ఉండలేరని.. మనశరీరభాగాలు చేసే చప్పుడు అతి భయానకంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ గదిలో ఒక్కరమే ఉన్నామంటూ ఒంటరిగా హారర్​ సినిమా చూస్తున్నట్టే అన్నమాట.


Tags:    

Similar News