ఏపీలో కంపెనీల మూత అంటూ తప్పు ప్రచారం?

Update: 2020-01-02 10:24 GMT
ఏపీ అధికారపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీయటానికి జరుగుతున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ప్రజల మనసుల మీద ప్రభావం చూపించేలా కొన్ని అంశాల్ని పట్టుకొని.. దాంతో వారు చేస్తున్న రచ్చను చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా ఈ తరహాలోనే ఒక వార్త వైరల్ అవుతోంది. 2019లో ఏపీలో 525 కంపెనీలు మూసి వేస్తూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు అప్లికేషన్లు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.


ఈ సమాచారాన్ని చూపించి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేయటం లేదన్న విష ప్రచారంతో పాటు.. భారీ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారంతా వెనక్కి వెళ్లిపోతున్నారంటూ ఒక విధమైన ప్రచారం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఎంతన్నది చూస్తే.. ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తాయి.
సాధారణంగా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున దరఖాస్తుల్ని పలువురు పెడుతుంటారు. అయితే.. అనుకున్న రీతిలో వాటిని నిర్వహించకపోవటం కానీ.. అసలు ప్రారంభించక పోవటం లాంటి అంశాల తో పాటు.. మరికొన్ని విషయాల కారణంగా ఏపీ నుంచి పరిశ్రమలు వెనక్కి వెళుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇందులో నిజం సగం మాత్రమేనని చెప్పాలి.


ఎందుకంటే..అనుకున్న రీతిలో ప్రాజెక్టులు రాకపోవటం ద్వారా మూసేయటం ఒక ఎత్తు అయితే..కొన్ని సందర్భాల్లో ముందుస్తుగా దరఖాస్తులు చేసేసి..కంపెనీలను ఏర్పాటు చేస్తారు. తమ పని పూర్తి అయిన తర్వాత వాటిని అర్థాంతరంగా మూసేస్తారు. ఎందుకిలా? అన్న అంశాన్ని చెక్ చేస్తే.. కంపెనీలను ఏర్పాటు చేయటం ద్వారా కొన్నింటి విషయాల్లో పనులు వేగంగా పూర్తి అవుతాయి. రాయితీలు కూడా లభిస్తాయి అందుకే కంపెనీల్ని పెట్టటం.. పని పూర్తి అయిపోగానే మూసి వేయటం చేస్తారు. దానికి సంబంధించి ఎక్కడా లేని లింకుల్ని బయటకు రాసి..అదే నిజమని నమ్మేలా ప్రచారం చేస్తారు. అలా అని అమరావతి నుంచి కంపెనీలు వెనక్కి వెళ్లలేదని చెప్పటంలో అర్థం లేదంటున్నారు.


గతంలో వివిధ కంపెనీలు ఆర్ వోసీకి సమర్పించి ఐదు వేల ఎటక్ట్రానిక్ ఫారమ్ లను ఈ ఏడాది ప్రాసెస్ చేశారు. గతంలో ఈ - పారమ్ ను ప్రాసెస్ చేయటానికి సగటున నెల రోజులు పట్టగా.. తాజాగా మూడు రోజుల్లోనే ప్రాసెస్ చేసి అనుమతులు ఇస్తున్నారు. మరింత వేగంగా ప్రభుత్వం పని చేస్తుంటే.. అందుకు భిన్నమైన ప్రచారం సాగటం గమనార్హం.


Tags:    

Similar News