పవన్‌ మీటింగ్‌లో మిస్సయిన వీడియో ఇదే!

Update: 2022-10-20 07:30 GMT
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను ప్యాకేజీ స్టార్‌ అనే సన్నాసి నా కొడుకులెవరు అంటూ ఉగ్ర రూపమెత్తారు. ఇంట్లో నుంచి లాక్కొచ్చి వైసీపీ నేతల దవడలు పగిలేలా చెప్పుతో కొడతానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

అయితే ఈ సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడటానికి ముందు గతంలో వైసీపీ నేతలు తిట్టిన బూతుల వీడియోలను పవన్‌ కల్యాణ్‌ టీవీలో ప్రదర్శించారు. అయితే పవన్‌ ప్రసంగాన్ని లైవ్‌ కవరేజీ చేసిన టీవీ చానెళ్లు కానీ, మరుసటి రోజు వార్తలు ప్రచురించిన పత్రికలు కానీ పవన్‌ ప్రసంగంపైనే దృష్టి సారించాయి. వైసీపీ నేతల బూతు వీడియోలను పవన్‌ ప్రదర్శించారనే విషయాన్ని విస్మరించాయి.

ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆ రోజు చానెళ్లు మిస్‌ అయిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది.

ఇందులో సీఎం జగన్‌తోపాటు వైసీపీ నేతలు సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, ఆర్కే రోజా, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, తదితరులు బూతులు మాట్లాడటం, అధికారులు, ప్రజలను అసభ్యంగా తిట్టడం వంటివాటిని ప్రదర్శించారు.

ఈ వీడియోలో గతంలో ముఖ్యమంత్రి జగన్‌ బోసిడికే అంటూ లంజా కొడుకు అని అనడం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ లంజా కొడుకులు అని తిట్టడం.. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చంద్రబాబుపై, పవన్‌ కల్యాణ్‌పై లంజా కొడుకులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. మంత్రి రోజా గతంలో అధికారులను దూషించడం.. జగన్‌.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబును ఉరితీసినా తప్పులేదని వ్యాఖ్యానించడం.. వంటి వాటిని పవన్‌ కల్యాణ్‌ ప్రదర్శించారు. అలాగే టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం, ఒక మహిళను చెంప మీద కొట్టడం వంటివాటిని చూపించారు.

అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమ లక్ష్యంగా వైసీపీ చేసిన దాడులు.. కార్లు ధ్వంసం చేయడం తదితరాలను కూడా పవన్‌ కల్యాణ్‌ ప్రదర్శించారు.

ఈ వీడియోను ముందు అందరికీ ప్రదర్శించాకే పవన్‌ కల్యాణ్‌ వైసీపీ నేతలను నా కొడకల్లారా అంటూ తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే పవన్‌ ప్రసంగాన్ని కవర్‌ చేసిన చానెళ్లు వైసీపీ నేతల బూతుల వీడియోను పట్టించుకోలేదు. దీంతో పవన్‌ అభిమానులు ఆ వీడియో ఇదేనంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News