ఆమె బాస్ వేసిన శిక్ష తెలిస్తే షాక్ తింటారు

Update: 2017-10-01 13:30 GMT
ఉద్యోగం చేసే వాళ్ల‌కే కాదు..వ్యాపారం.. చివ‌ర‌కు రాజ‌కీయాల్లో ఉండే వారికి సైతం ఒక బాస్ ఉంటారు. ఆ మాట‌కు వ‌స్తే ప్ర‌పంచంలో బాస్ లేనోళ్లు అంటే ఎవ‌రూ ఉండ‌రేమో? ఇక.. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు మేం చెప్పే ఉదంతం గురించి వింటే నోట మాట రాదంతే.

ఇప్ప‌టివ‌ర‌కూ మీరు విన‌ని.. చూడ‌ని బాస్ ముచ్చ‌ట ఇది. చైనాకు చెందిన ఒక యువ‌తి ఆఫీసుకు కారులో వ‌చ్చింది. వ‌ర్క్ హ‌డావుడితో.. మ‌రింకేదైనా ఆలోచ‌న‌లో ఉందో కానీ.. డ్రైవ్ చేసేట‌ప్పుడు కారులో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఆ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా ఆఫీసులో ప‌ని చేస్తూ.. కోలీగ్స్ తో మాట్లాడుతూ ఉంది.

అంత‌లోకే ఆమెను వాళ్ల బాస్ పిలిచారు. దేని కోసం పిలిచారో అని వెళ్లిన ఆమె.. బాస్ చెప్పిన మాట విని షాక్ తింది. ఆఫీసుకు కార్లో వ‌చ్చే క్ర‌మంలో తాను సీటు బెల్ట్ పెట్టుకోని వైనాన్ని వీడియోలో చూసిన ఆమె బాస్‌.. దిమ్మ తిరిగిపోయే ప‌నిష్మంట్ ఇచ్చారు.

కంపెనీ రూల్ ప్ర‌కారం కారు డ్రైవ్ చేసేట‌ప్పుడు సీటు బెల్ట్ త‌ప్ప‌నిస‌రి అని.. అలా చేయనందుకు  ఆమెకు చిత్ర‌మైన శిక్ష విధించారు. ఆపీస్‌ లో కోలీగ్స్ ముందు గోడ‌కు అనుకొని నిలుచోబెట్టి.. ఆమె ఎటూ క‌ద‌ల‌కుండా ప్లాస్ట‌ర్లు వేసేశారు. విధులు ముగిసే స‌మ‌యం వ‌ర‌కూ అలానే ఉండాల‌ని ఆర్డ‌ర్ వేశారు. ఇంత‌కు మించిన దారుణ‌మైన శిక్ష‌.. ఛండాల‌మైన బాస్ ఇంకెవ‌రికైనా ఉంటారా చెప్పండి? ఇప్పుడు అర్థ‌మైందా.. మీ బాస్ ఎంత మంచోడో?
Tags:    

Similar News