2007 టీ 20 ప్రపంచ కప్ ను ఎవరు మరచిపోలేరు. టీమ్ ఇండియా ఫైనల్ కు చేరి జగత్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఎప్పటికీ మరిచిపోలేనిది యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదేయడం. తనను రెచ్చగొట్టిన ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ కు బుద్ధి చెప్పేందుకు ఒక ఓవర్లో ఆరు సిక్సులు బాదేశాడు. యువీలాగే శ్రీలంక బ్యాట్స్ మెన్ తిసారా పెరీరా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది వివరాలు సరసన నిలిచాడు.
శ్రీలంకలో పనగోడలోని ఆర్మీ గ్రౌండ్ లో మేజర్ క్లబ్స్ లిమిటెడ్ ఓవర్ లిస్ట్ ఎ టోర్నమెంట్లో బ్లూమ్ ఫీల్డ్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్ తో జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్ లో శ్రీలంక ఆర్మీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న తిసారా పెరీరా సంచలన బ్యాటింగ్ తో ఈ రికార్డు సృష్టించాడు. శ్రీలంక నుంచి ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గా గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్ లో తిసారా పెరీరా కేవలం 13 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు.
తిసారా పెరీరా కేవలం 20 బంతులు మాత్రమే మిగిలి ఉండగా.. ఆ సమయంలో బ్యాటింగ్ కు వచ్చాడు. 39వ ఓవర్ చివరి బంతితో సిక్సర్ల వేట మొదలు పెట్టాడు. చివరి ఓవర్లో దిల్ హాన్ కూరే బౌలింగ్ లో తిసారా పెరీరా ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు బాది 36 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ దెబ్బతో కూరే తన 4 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు. తిసారా పెరీరా సూపర్ బ్యాటింగ్ తో శ్రీలంక ఆర్మీ జట్టు నిర్ణీత 41 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది.
సీనియర్ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ జాబితాలో సర్ గార్ ఫీల్డ్ సోబర్స్, రవి శాస్త్రి, హెర్షెల్ గిబ్స్, యువరాజ్ సింగ్, రాస్ వైట్లీ, హాజ్రతుల్లా జజాయ్, లియో కార్టర్, కీరన్ పోలార్డ్ ఉన్నారు. రెండు వారాల కిందట జరిగిన మ్యాచ్లో పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు సాధించి రికార్డు సృష్టించగా, ఇంతలోనే 31 ఏళ్ల తిసారా పెరీరా రికార్డును అందుకున్నాడు.