టీడీపీలో ఆ ముగ్గురు ప్రత్యక్షమయ్యారు

Update: 2021-07-11 03:30 GMT
తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయి, ప్రతిపక్షానికి పరిమితమై రెండేళ్ళు దాటేసింది. ఈ రెండేళ్లలో చాలామంది టీడీపీ నాయకులు సైలెంట్‌గానే ఉండిపోయారు. బయటకొచ్చి మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అనే భయంతో కొందరు నాయకులు అడ్రెస్ లేరు. ఈ క్రమంలోనే అలా సైలెంట్‌గా ఉన్న నాయకులు పార్టీ జంప్ చేసేయోచ్చని ప్రచారం కూడా వచ్చింది. అలా పార్టీ జంప్ చేసే వారి లిస్ట్‌లో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పేర్లు ఉన్నాయి.

అయితే ఈశ్వరి, రాజేశ్వరి 2014లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి వీరు పార్టీలో అడ్రెస్ లేరు. ఒకానొక సందర్భంలో వీరు వైసీపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ వీరు పార్టీ మారలేదు. ఇక తాజాగా టీడీపీ చేస్తున్న పోరాటంలో వీరు ప్రత్యక్షమయ్యారు. విశాఖపట్నం-తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో బాక్సైట్‌ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందంలో వీరు కూడా ఉన్నారు.

మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబుతో పాటు ఈ మాజీ ఎమ్మెల్యేలు కూడా పోరాటంలో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ సైతం ఈ పోరాటంలో కనిపించారు. పైగా చాలా బ‌లంగా వాయిస్ వినిపించారు. గత ఎన్నికల్లో శ్రావణ్ టీడీపీ తరుపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు. ఓడిపోయినా సరే ముందు పార్టీలో కాస్త యాక్టివ్‌గానే ఉన్నా త‌ర్వాత సైలెంట్  అయిపోవ‌డంతో ఆయ‌న పార్టీ మారిపోవ‌చ్చ‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

ఆయ‌న సైలెంట్‌గా ఉండ‌డంతో శ్రావణ్ కూడా జంప్ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు. ఇక పాడేరు, రంప‌చోడ‌వ‌రం మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వ‌రీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌న‌ప‌డ‌లేదు. అయితే తాజాగా పార్టీ ఇచ్చిన పిలుపులో పాల్గొన‌డంతో వారి ఆలోచ‌న మారిన‌ట్టే క‌నిపిస్తోంది.
Tags:    

Similar News