ఆచూకీ చెబితే బహుమానం ఇస్తామని, పలానా వాళ్ళని పట్టించిన వాళ్ళకు బహుమానం అంటు పోలీసులు ప్రకటించటమే చూసుంటారు ఇప్పటి వరకు. కానీ తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను చంపిన వాళ్ళకు బహుమానం ఇస్తామంటూ వెలసిన పోస్టర్లు పంజాబులో సంచలనంగా మారింది. పంజాబు, మొహాలి సెక్టార్ లోని 66,67 గైడ్ మ్యాప్ ప్రాంతంలో వెలసిన పోస్టర్లను చూసి జనాలు ఆశ్చర్యపోయారు. డీ గ్యాంగ్ పేరుతో కనిపించిన పోస్టర్లు ఒక్కసారిగా కలకలం రేపాయి.
స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పోస్టర్లో కనిపించిన ఈ మెయిల్ ప్రకారం నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. ఏదేమైనా ముఖ్యమంత్రిని చంపితే బహుమానం అంటు పోస్టర్లు వెలవటం బహుశా దేశంలో ఇదే మొదటిదేమో. ఒకవైపు పంజాబు రైతుల ఆధ్వర్యంలో ఢిల్లీ శివారు ప్రాంతంలో మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో సీఎం చాలా బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలో సీఎంకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలవటంతో రాజకీయంగా సంచలనంగా మారింది.