అధికార టీడీపీతో ఢీకొంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న నటుడు, నిర్మాత, వైసీపీ నేత మోహన్ బాబుకు తాజాగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. మోహన్ బాబు ఇటీవలే తన విద్యాసంస్థకు ఏపీ ప్రభుత్వం బకాయిపడ్డ స్కాలర్ షిప్ ల ఉందంతంలో టీడీపీకి వ్యతిరేకంగా ధర్నా చేసి అనంతరం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే..
కాగా వైసీపీలో చేరగానే బాబు గురించి పలు నిజాలను మీడియాకు వెల్లడిస్తూ టీడీపీని ఎన్నికల వేళ తీవ్రంగా ఇరుకునపెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయట.. దీనిపై మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు.
తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మోహన్ బాబు స్వయంగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.
గత నెల 26నుంచి పలు నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు డేటాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆ కాల్స్ విదేశాల నుంచి మోహన్ బాబుకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టు బంజారాహిల్స్ పోలీసులు మీడియాకు తెలిపారు.