హైదరాబాద్‌లో మాదాపూర్‌లో రియల్టర్ల మధ్య జరిగిన గొడవల్లో గన్ తీసి బెదిరించిన ఘటన చోటు చేసుకుంది. అందులోనూ ఈ «ఘటన జరిగిన స్థలం ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబుది కావడంతో అంతా ఏం జరిగిందా అని ఉలిక్కిపడ్డారు.
ఈ ఘటన వివరాల్లోకెళ్తే.. మాదాపూర్‌లో దగ్గుబాటి సురేష్‌బాబుకి స్థలం ఉంది. ఈ స్థలంలో భవనాలు నిర్మించే కాంట్రాక్ట్‌ను ఆయన సంజీవరెడ్డి అనే వ్యక్తికి అప్పగించారు. కాగా సురేష్ బాబు స్థలం పక్కనే రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి స్థలం ఉంది. తన స్థలంలోకి జరిగి మరీ నిర్మాణాలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
అంతేకాకుండా నిర్మాత సురేష్ బాబుతో సైతం వాగ్వివాదానికి దిగినట్టు తెలుస్తోంది. దీనిపై సురేష్ బాబు మేనేజర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి రామకృష్ణారెడ్డి మరోసారి నిర్మాణాలు జరుగుతున్న చోటుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు, కాంట్రాక్టర్ సంజీవ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సంజీవ రెడ్డి తన దగ్గర ఉన్న గన్‌తో రామకృష్ణారెడ్డిని బెదిరించాడు.
దీంతో, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంట్రాక్టర్ సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగుతున్నట్టు వెల్లడించారు.
కాగా గన్‌తో హల్‌చల్ చేసిన వివాదంలో నిర్మాత సురేష్ బాబుకి సంబంధం లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఉద్దేశపూర్వకంగానే సంజీవ్ రెడ్డి నిర్మాత సురేష్ బాబు పేరు ఉపయోగించుకుంటున్నాడని బాధితుడు చెబుతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.