క్వారంటైన్ లో ఉన్న మహిళ పై సామూహిక అత్యాచారం !

Update: 2020-04-27 11:10 GMT
దేశంలో కరోనా ఒకవైపు విజృంభిస్తుంటే మరోవైపు మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నిర్భయ , దిశా లాంటి చట్టాలు ఎన్ని వస్తున్నా, నిందితులను ఎంతో కఠినంగా శిక్షిస్తున్నా కూడా ఆ మృగాళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. కరోనా వ్యాప్తి చేయకుండా లాక్ ‌డౌన్ విధిస్తే.. కీచకులకు దాన్ని కూడా తమకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆఖరికి క్వారంటైన్‌‌ లో ఉన్న మహిళలను కూడా వదలడం లేదు. తాజాగా క్వారంటైన్‌ లో ఉన్న ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని సవాయి మదోపూర్ ప్రాంతం బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఈ సంఘటన గురించిన పూర్తి వివరాలు చూస్తే ..జైపూర్ ‌కు చెందిన ఓ మహిళ లాక్‌డౌన్ కారణంగా మాధోపూర్‌ లో ఉండిపోవాల్సి వచ్చింది. నెల రోజులు అయినా లాక్‌ డౌన్ తొలగించకపోవడంతో చివరకు చేసేదేమి లేక కాలినడకన సొంతూరుకు బయలు దేరింది. పోలీసులు పట్టుకొని బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఉంచారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో పోలీసులు మరో ప్రాంతం నుంచి వస్తుండడంతో సదరు మహిళను క్వారంటైన్‌ లో ఉండాలని సూచించారు.

గ్రామస్థుల సహకారంతో ఓ ప్రభుత్వ స్కూల్ లో ఆమెను క్వారంటైన్‌ లో ఉంచారు. ఇదే అదునుగా భావించిన ముగ్గురు యువకులు ఆమె పై అర్ధరాత్రి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గత గురువారం రాత్రి ఈ ఘటన జరుగగా.. ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది.
Tags:    

Similar News