కింగ్ కోఠి ఆసుపత్రిలో ముగ్గురు మృతి ..అసలు విషయం చెప్పిన డీఎంఈ !

Update: 2021-05-10 12:30 GMT
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని కింగ్ కోఠి ఆసుపత్రిలో ఆక్సిజ‌న్ కొర‌త కార‌ణంగా ముగ్గురు మరణించారని ఆదివారం రాత్రి  నుండి ఓ వార్త పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. అయితే, కింగ్ కోఠిలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని ప‌లు మీడియా ఛానెళ్లల్లో వ‌స్తున్న వార్త‌ల‌పై తెలంగాణ డీఎంఈ   డాక్ట‌ర్ కే ర‌మేశ్ రెడ్డి సోమ‌వారం స్పందించారు.

కింగ్ కోఠి ఆసుపత్రిలో ఆక్సిజ‌న్ కొర‌త కార‌ణంగా ముగ్గురు క‌రోనా రోగులు చ‌నిపోయార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు.   ప్ర‌స్తుతం కోఠి ఆసుపత్రిలో 13 కేఎల్ లిక్విడ్ ఆక్సిజ‌న్ ఉంద‌ని అన్నారు. అయితే చనిపోయారంటున్న ఆ ముగ్గురు రోగులు కూడా వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నార‌ని రమేష్ రెడ్డి తెలిపారు. ప్ర‌తి రోజు ఆసుపత్రికి తగినంత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని , గ‌తేడాది కాలం నుంచి కూడా ఆసుపత్రిలో కరోనా రోగుల‌కు అత్యుత్త‌మైన వైద్య సేవ‌లు అందిస్తున్నామ‌ని స్పష్టంచేశారు. ఆక్సిజ‌న్ కొర‌త కార‌ణంగా రోగులెవరూ చనిపోలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్త‌ల‌ను చూసి ప్ర‌జ‌లు ఎవ‌రూ ఆందోళ‌న‌ చెందవద్దు అని , ఆ వార్త‌లు అవాస్త‌వ‌మ‌ని డీఎంఈ ర‌మేశ్ రెడ్డి తెలియజేశారు.
Tags:    

Similar News