ఉరిశిక్ష.. దాదాపుగా నాలుగు దశాబ్దాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడుమరోసారి చర్చనీయాంశమైంది. సమత హత్యాచారం కేసులో ముగ్గురు దోషులకు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. అయితే.. ఆ శిక్షను ఎక్కడ అమలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో 1978లో చివరిసారిగా ముషీరాబాద్ సెంట్రల్ జైల్ లో ఉరిశిక్ష అమలైంది. ఆ తర్వాత.. ఉరిశిక్షలు లేకపోవడం, ముషీరాబాద్ జైలు చర్లపల్లికి తరలిపోవడం, అక్కడ ఉరికంబాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పుడు తెలంగాణలోని ఏ కారాగారం లోనూ ఉరిశిక్ష అమలుకు అవకాశం లేదు.
సమత కేసుతోపాటు, వరంగల్ లో 9నెలల చిన్నారి హత్యాచారం కేసులో దోషికి, దిల్ సుఖ్ నగర్ జంటపేలుళ్ల కేసులో ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఉరిశిక్షలు ఖరారయ్యాయి. కాగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, ఒక్క జైల్లోనైనా ఉరికంబం ఉండగా తెలంగాణలో మాత్రమే ఉరికొయ్యలు లేని జైళ్లు ఉన్నాయి. జంటపేలుళ్ల కేసులో శిక్షలు ఖరారవ్వగానే, తెలంగాణ జైళ్లలో ఉరికంబాల ఏర్పాటుపై చర్చ జరిగింది. అప్పటి జైళ్ల శాఖ డీజీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. చంచల్‌గూడ, వరంగల్ కేంద్ర కారాగారాల్లో ఉరికంబాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రస్తావించారు.
ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా జైలు మాన్యువల్స్ ఉంటాయి. వాటి ప్రకారం.. ఉరిశిక్ష పడ్డ ఖైదీలను అదే రాష్ట్రంలో ఉరి తీయాలి. రాష్ట్రంలో ఉరిశిక్ష పడ్డ దోషుల కోసం ఓ ఉరికంబాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. కాగా స్వసంత్య్రం వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా 94 మందికి ఉరిశిక్షలు అమలు చేశారు. వాటిల్లో 42 ఉరిశిక్షలు రాజమండ్రి కేంద్ర కారాగారం లో అమలయ్యాయి.
ఇకపోతే, చివరగా 1993 నాటి చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ఇద్దరు దోషులకు ఉరిశిక్ష పడగా 1997లో వారిని రాజమండ్రి జైలుకు తరలించారు. 1999లో డెత్ వారెంట్ జారీ అయ్యింది. నిర్ణీత తేదీన తెల్లవారుజామున 5గంటలకు ఉరి తీయాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు యధా తథస్థితి కారణం గా.. ఉరిశిక్ష ను రద్దు చేయాలంటూ తెల్లవారు జామున ఒంటి గంటకు జైలు అధికారులకు ఫోన్‌కాల్ వచ్చింది. దీనితో ఆ ఉరిని జైలు అధికారులు రద్దు చేసారు.